calender_icon.png 12 November, 2025 | 2:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజన్నే దిక్కు!

12-11-2025 12:50:20 AM

సిరిసిల్ల, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా వేములవాడ రాజరాజేశ్వర స్వామికి (రాజన్న) మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. మొక్కుల్లో  భాగ ంగా ప్రతినిత్యం స్వామికి కోడెలు సమర్పిస్తుంటారు. తిప్పాపూర్‌లోని గోశాలలో సంవత్సరం క్రితం గోవులు మృత్యువాత పడ్డ అనంతరం మంత్రి కొండా సురేఖ ఆదేశాలతో సామర్థ్యానికి మించి ఉన్న గోవుల సంఖ్యను తగ్గించేందుకు.. గోవులను భక్తులకు పంపిణీ చేయాలని నిర్ణయించి దానిని మళ్లీ నిలిపివేశారు.

రాజన్న ఆలయానికి కోడె మొక్కుల ద్వారా 22 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. ఆదాయం వస్తుంది కానీ గోశాల నిర్వహణపై దృష్టిసారించకపోవడం విమర్శలకు దారితీ స్తున్నది. గతంలో 500 గోవులు ఉండాల్సిన గోశాలలో 1200 వరకు ఉండడంతో అవి మృత్యువాత పడ్డాయి. ఆ సంఘటన అనంతరం తేరుకుని 500 వరకు గోవులు ఉండే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నా రు. కానీ నూతన గోశాల నిర్మాణంపై ప్రభు త్వం దృష్టి సారించడం లేదు.

గోవుల మృ త్యువాత అనంతరం ప్రభుత్వం ప్రత్యేకంగా 50 ఎకరాల స్థలాన్ని కూడా కొత్త గోశాలకు కేటాయించింది. సంవత్సరం కావస్తున్నా గో శాల నిర్మాణం జరగలేదు. రాజస్థాన్ ప్రాం తంలో 2 వేల ఎకరాల్లో లక్షా 50 వేల గోవులను సంరక్షిస్తూ దేశానికే అక్కడి గోశాల ఆద ర్శంగా నిలిచింది. అయితే రాజన్న ఆలయ గోశాలలో తరచూ దురదృష్టకర సంఘటన లు జరుగుతున్నా, రాజస్థాన్ గోశాలను ఆదర్శంగా తీసుకుని ఆధునీకరించే దిశగా అడు గులు వేయడం లేదు.

గత సంవత్సరం జరిగిన సంఘటనల అనంతరం గోశాలలో ఉ న్న కోడెలను రైతులకు అందించాలని నిర్ణయించి 1,279 వరకు పంపిణీ చేశారు. వెను వెంటనే పంపిణీ ప్రక్రియను నిలిపివేశారు. గతంలో నందిని గోశాలలో పాత షెడ్లు పది ఉండగా, ఒక షెడ్డులో వరి గడ్డిని నిల్వ చేసేవారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన అనంతరం గోవుల మృత్యువాత సం ఘటన జరిగిన అనంతరం మరో మూడు కొత్త షెడ్లను అందుబాటులోకి తెచ్చారు. ఒ క్కో షెడ్డులో 50 నుంచి 60 కోడెలు ఉం డేలా సౌకర్యాలు కల్పించారు.

కోడెల నిర్వహణ లోపాన్ని కప్పిపుచ్చేందుకు అధికా రులు తరచూ భక్తులపై ఆరోపణలు చేస్తూ తమ తప్పును కప్పిపుచ్చుకుంటున్నారు. కో డెల మొక్కులు చెల్లించుకునే భక్తులు అనారోగ్యంతో ఉన్న కోడెలు, జెర్సీ, పాలు మర వని కోడెళ్లను తీసుకువస్తున్నారని ఆరోపిస్తుండడం సైతం విమర్శలకు తావిస్తున్నది. పశువైద్యులను నిరంతరం అందుబాటులో ఉంచకుండా భక్తులపై తప్పులను నెట్టివేయ డం జరుగుతూ వస్తుంది.

పట్టింపులేని ప్రభుత్వం..

వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యువాత అనంతరం రాష్ట్రవ్యాప్తంగా దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయా ల్లో నిర్వహిస్తున్న గోశాలలపై ప్రభుత్వం దృ ష్టిసారించింది. రాష్ట్రంలోని 69 ఆలయాల్లో గోశాలలను నిర్వహిస్తున్నారు. ఇందులో అ తి పెద్దది వేములవాడ గోశాలనే. వేములవా డ గోశాల కోసం 50 ఎకరాల స్థలాన్ని అదనంగా ప్రభుత్వం కేటాయించింది. మర్రిపల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్న 30 ఎకరాల ప్ర భుత్వ భూమిని గుర్తించింది.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 50 ఎకరాల్లో గోశాలను నిర్మించాలని సూచనచేసిన అనంతరం మ రో 20 ఎకరాల భూమిని కూడా సేకరించా రు. అయితే నేటికి గోశాల నిర్మాణంపై ప్రభు త్వం దృష్టిసారించలేదు. గోవుల మృత్యు సంఘటన అనంతరం దేవాదాయశాఖ సమర్పించిన నివేదికపై ప్రభుత్వం అధ్యయ నం చేసి నూతన గోశాల నిర్మాణంపై మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే నిధుల కేటాయింపు, గోశాల నిర్మాణంపై ఇప్పటివరకు అడుగు ముందుకు కదలలేదు.

నందిని గోశాల నిర్వహణ లోపాలు..

వేములవాడ హరిహర పుణ్యక్షేత్రంలో నందిని గోశాలను జూన్ 2020లో ఏర్పా టు చేశారు. కేవలం ఆవులను రక్షించే కేం ద్రంగానే కాకుండా సనాతన ధర్మంలో ఇమి డి ఉన్న వారసత్వ పరిరక్షణ, వైదిక సాంప్రదాయంలో గోవును ఒక సంపదను ప్రసా దించే దేవిగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ గోశాల ఫౌండేషన్ తర్వాత గోవుల మృ త్యువాత అనంతరం తేరుకున్నప్పటికీ ఇదొక ఆదాయం సృష్టించే కామధేనువుగా చూస్తున్నారు తప్ప, గోవుల ఆరోగ్యం, పశుగ్రాసంపై దృష్టిసారించడం లేదు.