calender_icon.png 27 October, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతంత్ర ఉద్యమం సాయుధ పోరాటాలలో గ్రంథాలయాలది కీలకపాత్ర..

26-10-2025 10:42:09 PM

- కొంపల్లిలో గ్రంథాలయ భవనానికి భూమి పూజ...

- వేదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మెఘరెడ్డి

మునుగోడు (విజయక్రాంతి): స్వాతంత్ర ఉద్యమాలు, సాయుధ పోరాటాల వంటి కీలక ఉద్యమాలలో గ్రంథాలయాలు ప్రజలను క్రియాశీలక పాత్ర పోషించాయని వేదిరే పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరే మెఘరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని కొంపల్లి గ్రామంలో 16 లక్షల రూపాయలతో గ్రంథాలయ ఏర్పాటుకు నోస్ ల్యాబ్ ప్రైవేటు లిమిటెడ్ వారి సౌజన్యంతో సిఎస్ఆర్ నిధుల నుండి మంజూరైన గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి కొంపల్లి రామలింగేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ వేదిరే విజయేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసి మాట్లాడారు. గ్రంథాలయాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా, చారిత్రక, రాజకీయ, సామాజిక ఉద్యమాలకు మార్గనిర్దేశం చేసి, విజ్ఞానవంతులైన, చైతన్యవంతమైన పౌరులను తయారు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు. చరిత్రలో గ్రంథాలయ ఉద్యమాలు స్వాతంత్ర పోరాటానికి మద్దతు ఇచ్చాయి, ప్రజలను దేశభక్తితో, పోరాటానికి సిద్ధం చేశాయి. ఈ విధంగా గ్రంథాలయాలు దేశానికి నిజమైన వీరులను తయారు చేస్తాయన్నారు. 

గ్రంథాలయాలు వివిధ రకాల పుస్తకాలు, పత్రికలు, డిజిటల్ వనరులను అందిస్తాయి, ఇవి ప్రజలలో జ్ఞానాన్ని పెంచుతాయి, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు గ్రంథాలయాలు మార్గనిర్దేశం చేస్తాయి, తద్వారా వారు ఉన్నత స్థానాలకు చేరుకుని దేశానికి సేవ చేయగలుగుతారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వామి, గ్రామ మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ జీడిమడ్ల యాదయ్య, నాంపల్లి కృష్ణ,హనుమయ్య, దాం యాదయ్య,బత్తుల శ్రీను, సూర శంకర్, బోయపర్తి సురేందర్,బాజా మనోజ్ సంకు శంకర్,మోగుదాల లింగస్వామి,అన్యపు అలివేలు, వడ్డేపల్లి దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలు ఉన్నారు.