26-10-2025 10:39:10 PM
కట్టా సతీశ్..
కొత్తగూడెం (విజయక్రాంతి): ఎన్నికల హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తు, రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ చేపట్టిన సామాజిక చైతన్య రధయాత్ర మంగళవారం, కొత్తగూడెం చేరుకోనున్నట్టు రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కట్టా సతీష్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికై 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి బకాయిల చెల్లింపు, యువత రాజకీయంలోకి రావాలి తెలంగాణను ఏలుకోవాలనే లక్ష్యంతో రాష్ట్రీయ లోక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ చేపట్టిన, సామాజిక చైతన్య రధయాత్ర, 28వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన కర్నార్ మీటింగ్ ను విజయవంతం చేయాలని, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు కట్టా సతీష్ పిలుపునిచ్చారు.