26-10-2025 10:54:11 PM
ముఖ్యఅతిథిగా హాజరైన బీఆర్ఎస్ యువ నాయకులు మాణిక్ యాదవ్
అమీన్ పూర్: పటాన్ చెరు, బండ్లగూడ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు. ప్రాంతమంతా డప్పుల సవ్వడులు, యాదవ సమాజం ఉత్సాహం, సాంప్రదాయ వైభవం నిలిచిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాణిక్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. సదర్ పండుగ మన యాదవ సమాజ గర్వకారణం ఇది కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు మన సంప్రదాయం, మన సంస్కృతి, మన ఐక్యతకు అద్దం పడే పండుగ పశువుల పట్ల ప్రేమ, ఆరాధనను ప్రపంచానికి పరిచయం చేసే ఇలాంటి ఉత్సవాలు యాదవ సమాజ బలాన్ని, ఐక్యతను మరింత బలపరుస్తాయి.
మన యువత ఈ సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లాలి, సమాజ అభివృద్ధి కోసం అందరం కలసి కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ సీ పురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్, పటాన్ చెరు టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్, బండ్లగూడ ప్రెసిడెంట్ భరత్, యాదవ సమాజ నాయకులు, మిత్రులు, పెద్దలు, యువత, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.