07-09-2025 12:38:53 AM
తవ్వకాల్లో బయటపడుతున్న పురాతన నాగరికత
ఉపేంద్ర భూపాలుడు అనే రాజు పాలించిన ఓ పట్టణం గతంలో కాలగర్భం లో కలిసిపోయింది. ఇప్పుడు తవ్వకాల్లో ఆ గ్రామం ఆనవా ళ్లు బయటపడుతున్నాయి. ఉపేంద్ర పట్టణంగా గత కాలంలో పిలువబడిన ఆ గ్రామం నేడు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని కుప్పానగర్‌గా మారిందని స్థానికులు చెపుతుంటారు.
ఉపేంద్ర భూపాలుడి పాలన
వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పెద్ద పట్టణం ఉండేదని, ఈ ప్రాంతాన్ని ఉపేంద్ర భూపాలుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడని, ఇక్కడ ఏర్పడిన వాతావరణ మార్పుల వల్లనో, భూకంపం వల్లనో ఈ గ్రామం భూగర్భంలోకి వెళ్లినట్లు ఆధారాలు చెపుతున్నాయి. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని కుబేర పట్టణాన్ని పరిపాలించిన ఉపేంద్ర భూపాలుడు అనే రాజు నిర్మించినట్లు పురాణాల్లో ఉన్నది. ఇప్పటికీ శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర స్కంద పురాణంలోనూ ఉపేంద్ర భూపాలు అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఏటా జరిగే శివరాత్రి ఉత్సవాల్లో ప్రస్తావన వస్తుంది.
బయటపడుతున్న ఆనవాళ్లు
కుప్పానగర్ గ్రామ పంట పొలాల్లో మట్టిని తవ్వితే వందల ఏళ్ల క్రితం ఇళ్లు కట్టిన ఆనవాళ్లు, మానవుల అస్తిపంజరాలు, మట్టి కుండలు బయపడుతున్నాయి. అతి పురాతనమైన చక్కని శిల్పితో తయారుచేసిన రాతి విగ్రహాలు బయటపడుతున్నాయి. శివలింగాలు, దేవి విగ్రహాలు కూడా తవ్వకాల్లో లభిస్తున్నాయి. మట్టి తవ్వకాల్లో బయటపడ్డ దేవీ విగ్రహాన్ని గ్రామానికి చెందిన మహిళా భజన మండలి మహిళలు భవాని మాత నామకరణం చేసి గుడిని కట్టించారు. బయటపడ్డ రెండు శివలింగాలను హనుమాన్ మందిర్‌లో ప్రతిష్టించారు.
వేల ఏళ్ల క్రితం అది ఓ పట్టణం!
మట్టి తవ్వుతుండగా గుడి ఆనవాళ్లు, గ్రామం ఉన్నట్లు గోడలు బయటపడుతుంటాయి. ఇక్కడ నివసించిన ప్రజలు పొడవు ఎక్కువ ఉండేవారని వారి అస్తికలుబట్టి అర్థం అవుతుందని గ్రామస్థులు చెపుతుంటారు. ఇక్కడి పంట పొలాల్లో కలుపు తీస్తుండగా కూలీలకు ముత్యాలు, పగడాలు వంటివి దొరుకుతూ ఉంటాయి. కొందరికి బంగారు నాణేలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. దీంతో భూమిలో బంగారం ఉన్నట్లు భావిం చిన కొందరు తాంత్రి కులు వచ్చి పూజలు చేస్తుం టారని సమాచారం. విగ్ర హాలు లభ్యమయ్యే పరిసర ప్రాంతాల్లో కొన్ని రాళ్లపై లిపి కూడా లిఖంచబడి ఉంది. ఈ లిపి ఏ రాజుల కాలంనా టిదో తెలియడం లేదు.
లక్ష్మణ్‌యాదవ్, జహీరాబాద్