calender_icon.png 14 May, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలి

14-05-2025 12:00:00 AM

మహబూబాబాద్, మే 13 (విజయ క్రాంతి); కార్మిక నాయకులు స్వర్గీయ తోట బిక్షం స్ఫూర్తితో జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుల రాజు, కుంట ఉపేందర్  పిలుపునిచ్చారు.

దివంగత  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోట బిక్షం 4 వ వర్ధంతి సందర్భంగా సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన స్థూపం వద్ద అరుణ పతాకాన్ని తోట శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.

ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుణగంటి రాజన్న, సమ్మెట రాజమౌళి, రావుల రాజు, హేమ నాయక్, తోట యాకయ్య, మల్లయ్య, కోటేశ్వరరావు, సుధాకర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.