calender_icon.png 12 August, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండ్లు.. ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

12-08-2025 03:34:57 PM

నకిరేకల్,(విజయక్రాంతి): భూమిలేని పేదలకు భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి కేంద్రం 10 లక్షలు రాష్ట్ర 5 లక్షలు ఇంటి నిర్మాణానికి  ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నకిరేకల్ పట్టణంలోని ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో గ్రామీణ ప్రాంతాల నుండి వస్తువు ఉన్న మహిళా కార్మికుల సమస్యలపై సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం యాంత్రికరణ పెరిగిన తర్వాత ఉపాధి లేక పట్టణాలకు భవన నిర్మాణ పనుల కోసం వలస వస్తున్నారని వారికి పనికి తగిన వేతనం అందడం లేదని పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకుగురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెలలో 15 రోజులకు మించి పని దొరకడం లేదని ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా పేర్లు నమోదు చేసుకొని పని కల్పించాలని డిమాండ్ చేశారు.

నిర్మాణ కార్మికుల అడ్డాప్రదేశాలలో మహిళలకు మౌలిక సదుపాయాలు బాత్రూంలు షెడ్లు ఏర్పాటు చేయాలని, ఇండ్లు లేని నిరుపేద నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి కేంద్రం 10 లక్షలు ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించాలని డిమాండ్ చేశారు. పురుషులతో సమానంగా మహిళలు పనిచేస్తున్న ఇచ్చే కూలిలో వ్యత్యాసం ఉంటుందని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు.