calender_icon.png 12 August, 2025 | 5:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల తనిఖీలు

12-08-2025 03:38:54 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రైల్వే స్టేషన్, టీ జంక్షన్ వద్ద మంగళవారం ఎస్సై చిలుముల కిరణ్ కుమార్, పోలీసులు నిర్వహించారు. రానున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చూసేందుకు ఆకస్మిక తనిఖీలను నిర్వహించినట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వాహనాలను తనిఖీ చేసి ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని వాహనదారులకు సూచించారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.