12-08-2025 03:07:07 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15న జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రక్తదానం చేయాలనుకునే అటవీశాఖ సిబ్బందితో పాటు ప్రజలు కూడా పాల్గొని విజయవంతం చేయాలని, రక్తదానం చేయడం ఇతరులకు ప్రాణదానం చేయడం లాంటిదని పేర్కొన్నారు. వివరాల కోసం 9440810099,8019810398,9110787432, 9494027575, 8639749842 నెంబర్లను సంప్రదించాలని, ఎక్కువ మొత్తంలో రక్తదాతలు హాజరు కావాలని కోరారు.