calender_icon.png 18 July, 2025 | 10:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంచుకొస్తున్న ఇంధన సంక్షోభం!

17-06-2025 12:00:00 AM

చైనా పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు రెట్లు అధిక పెట్టుబడులను సౌరవిద్యుత్ తయారీ కోసమే వినియోగించాలని ప్రణాళికలు వేయడం గమనార్హం. యుద్ధాలవల్ల అయితేనేమి, మరే ఇతర కారణాలవల్ల అయితేనేమీ ప్రపంచ స్థాయిలో ఇంధన సంక్షోభం మరోపక్క గత్యంతరం లేని పరిస్థితిలో పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పాదకతవైపు ప్రభుత్వాలను మళ్లిస్తుందనడంలో సందేహం లేదు. 

ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్  దేశాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం త్వరలో ప్రపంచంలో మళ్లీ ఇంధన సంక్షోభాన్ని తెస్తుందా? అంటే, ‘అవున’నే కొందరు విశ్లేషకులు సమాధానమి స్తున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకున్నందున చమురు ధరలు బ్యారెల్‌కు 200 అమెరికన్ డాలర్లమేర వరకు పెరగవచ్చని ఇరాక్ విదేశాంగ శాఖమంత్రి తాజాగా హెచ్చరించారు.

ఈ మధ్యప్రాచ్య సంఘర్షణ చివరకు ఎక్కడికి దారి తీస్తుం ది? ఏం జరగనుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పటికి జరిగిన పరిస్థితులు ప్రపంచంలో తీవ్ర ఇంధన సమస్యను సృ ష్టించే ప్రమాదం మాత్రం పొంచి ఉన్నట్టు తెలుస్తున్నది.

ఈ మేరకు ‘ది ఎకనామిక్స్ టైమ్స్’ విశ్లేషణాత్మక కథనం ఒకటి ప్రచురించింది. అందులో వెలిబుచ్చిన అభిప్రా యం విశ్వసనీయంగా ఉందనడానికి పై ఇరుదేశాల మధ్య వేగంగా పెరుగుతున్న ఉద్రిక్తతలు, జరుగుతున్న యుద్ధ పర్యవసానాలనే నిదర్శనంగా పేర్కొనాలి.

అంతర్జాతీయ స్థాయిలో ఇంధన సంక్షోభం గతంలో 2021లో తీవ్రస్థాయిలోనే ఏర్పడింది. అయితే ఆనాటి కారణా లలో రికార్డు స్థాయిలో ధరలు పెరగడం, అప్పటికే కొవిడ్ విజృంభణ, మరోవైపు ఇంధన కొరత, పెరుగుతున్న పేదరికం, ఆర్థిక వ్యవస్థలు మందగించడం వంటివి ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. కానీ, ఈనాటి యుద్ధాల ప్రభావం ప్రధానంగా సంప్రదాయ ఇంధనంపైనే పడుతున్నది.

2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత ఇంధన రంగం పరిస్థితిలో నాటకీయ మార్పు సంభవించింది. సహజ వాయువు ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఫలితంగా కొన్ని దేశాల మార్కెట్లలో విద్యుచ్ఛక్తి ధరకూడా పెరిగింది. ఈ క్రమంలోనే 2008 తర్వాత అత్యధిక స్థాయికి చమురు ధరలు చేరుకున్నాయి.

ద్రవ్యోల్బణానికీ అవకాశం

గత కొంతకాలంగా ప్రపంచంలో యు ద్ధాల సీజన్ నడుస్తున్నది. తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వివాదం పరిస్థితిని మరింత తీవ్రస్థాయికి చేర్చింది. ఈ క్రమంలోనే ప్రపంచ చమురు ధరలను బ్యారెల్‌కు సుమారు 200 300 అమెరికన్ డాలర్ల వరకు పెంచవచ్చని ఇరాక్ విదేశాంగ మంత్రి ప్రకటన గమనించదగ్గది. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంలో ఉత్పత్తి తగ్గి పోయినట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు అంతకంతకూ మరింత పెరుగుతున్నందున ఎగుమతులకు అంతరాయం కలగవచ్చుననీ  తెలుస్తున్నది. చమురు సంక్షోభం కాస్తా ద్రవ్యోల్బణానికి కారణం అవుతుందని కూడా పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఇంధన ఉత్పత్తిదారులు, దిగుమతిదారులను ప్రభావితం చేయగలదని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత ప్రపంచ ఇంధన సంక్షోభ భయాలకు అద్దం పడుతున్నది. పరిస్థితి మరింతగా దిగజారితే, ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి కీలక ఇంధన మార్గాలను కనుక మూసి వేయడం జరిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగవచ్చన్నది ఇరాక్ విదేశాంగ శాఖమంత్రి హెచ్చరికలోని అంతరార్థం.

చమురు ధరల పెరుగుదల గురించి ఇరాక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఫువాద్ హుస్సేన్, జర్మనీ విదేశాం గ మంత్రి జోహన్ వాడేఫుల్‌తో చర్చించారు. హార్ముజ్ జలసంధిని మూసి వేస్తే చమురు ఎగుమతులు తగ్గవచ్చని, ఈ పరిస్థితి ఇరాక్, ఇతర ఉత్పత్తిదారులను ప్రభా వితం చేస్తుందని హుస్సేన్ అన్నారు. ఐ ఎన్‌ఏ వార్తా సంస్థ నివేదిక కూడా దీని తా లూకు పలు విషయాలను వెల్లడించింది.

హార్ముజ్ జలసంధిని మూసి వేయ డం వల్ల మార్కెట్ నుంచి రోజుకు ఐదు మిలియన్ బ్యారెళ్ల చమురు తొలగించడం జరు గుతుందని హుస్సేన్ అన్నారు. ఈ చమురులో ఎక్కువ భాగం పెర్షియన్ గల్ఫ్, ఇరాక్‌ల నుంచి వస్తుంది. అటువంటి అంతరాయంతో ఐరోపాలో ద్రవ్యోల్బణం పెరగడంతోసహా తీవ్ర ఆర్థిక ప్రభావాలకు కారణమవుతుందనీ తెలుస్తున్నది.

ఇజ్రాయెల్- ఇరాన్ వివాదం ఇంధనాన్ని దిగు మతి చేసుకునే దేశాలకు ద్రవ్యోల్బణం, ఆర్థిక సమస్యలను సృష్టించ వచ్చని కూడా హుస్సేన్ హెచ్చరించారు. ఎగుమతులు ఆలస్యం అయితే లేదా పూర్తిగా ఆపి వేయబడితే ఉత్పత్తిదారుగా ఇరాక్ కూడా సమ స్యలను ఎదుర్కోవాల్సి వస్తుందేమో అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

సహజ వాయువు క్షేత్రానికి పెద్ద దెబ్బ

ఈ సందర్భంలో ఇరాక్ అంతర్జాతీయ ప్రతిస్పందనకు పిలుపునిచ్చింది. ఇరాన్‌లో ఇజ్రాయెల్ సైనిక చర్యలు అంతర్జా తీయ చట్టాన్ని, ప్రాంతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నాయని కూడా ఇరాక్ మంత్రి ఆరోపించారు. ఈ చర్యలను అంద రూ ఖండించాలని ఆయన ప్రపంచ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ రకమైన నిరం తర సంఘర్షణ ప్రాంతీయ, ప్రపంచ స్థా యి స్థిరత్వానికి హాని కలిగిస్తుందనీ ఆయ న నొక్కి చెప్పారు.

ఇజ్రాయెల్ సంఘర్షణ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పెద్ద ఎత్తున తాకింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత ఇరాన్ సౌత్ పార్స్‌లో గ్యాస్ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది. గ్యాస్ క్షేత్రం 14వ దశ దెబ్బ తిన్నట్టు వార్తలు వచ్చాయి.

రోజువారీ ఉత్పత్తి 12 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఆగిపోయింది. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇజ్రాయెల్ కారణంగా సంభవించిన మొదటి దెబ్బగా దీని ని పలువురు పేర్కొంటున్నారు. ప్రపంచ స్థాయిలో ‘సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రం’ వ్యూహాత్మక పాత్ర గమనించదగ్గది. 

సౌత్ పార్స్ క్షేత్రాన్ని ఇరాన్, ఖతార్ దేశాలు పంచుకుంటాయి. ఇది ఇరాన్ గ్యాస్‌లో మూడింట రెండు వంతులను అందిస్తుంది. విద్యుత్, తాపనం (హీటింగ్), పరిశ్రమలకు ఉపయోగించడం జరుగుతుంది. ఇరాన్ ఏటా 275 బిలియన్ సెం.మీ. గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోంచి ప్రధానంగా దేశీయ వినియోగం కోసమే వెచ్చిస్తారు. కానీ, దీనిలోంచి ఒక చిన్న భాగం ఇరాక్‌కు ఎగుమతి అవుతుంది.

అదే క్షేత్రం నుంచి ఖతార్ కూడా తన గ్యాస్‌ను ఎగుమతి చేస్తుంది. ఈ ప్రాం తంలోనే జరిగిన దాడి, ఆర్థిక లక్ష్యాలు ఇప్పుడు సంఘర్షణలో భాగంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రారంభ దాడి తర్వాత చమురు ధరలు 14% పెరిగాయి. మరిన్ని దాడులు ఖతార్ ఎల్‌ఎన్‌జీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయని, సరఫరాలకు అంతరాయం కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఖార్గ్ ద్వీపం లేదా హార్ముజ్ జలసంధి వంటి కీలక ఇం ధన కేంద్రాలు దెబ్బ తిన్నట్లయితే చము రు, గ్యాస్ ధరలు తీవ్రంగా పెరుగుతాయనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. గ్యాస్ కొరత, విద్యుత్ కోతల కారణంగా ఇరాన్ దేశీయ ఇంధన సంక్షోభం ఇప్పటికే తీవ్రమవుతున్నది. తాజా స్ట్రుక్ (ఆకస్మిక మిలటరీ దాడి) ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నది. పర్యవసానంగా ప్రపంచ చమురు ధరలపై దీని ప్రభావం ప్రస్ఫుటమవుతుంది. 

ప్రత్యామ్నాయ ఇంధనమే శరణ్యం

ఒకవైపు పునరుత్పాదక ఇంధనాల సా మర్థ్యం పెరుగుదల జరుగుతున్నది కూ డా. మరో ఐదేళ్లలో ఇది రెట్టింపు కాగలదని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనా వేసింది. అయితే, ఇంధన సంక్షోభాల నుంచి గట్టెక్కడానికి ఆయా దేశాలు పునరుత్పాదక శక్తి లేదా ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

చైనా పునరుత్పాదక ఇంధన రంగంలో మూడు రెట్లు అధిక పెట్టుబడులను సౌరవిద్యుత్ తయారీ కోసమే వినియోగించా లని ప్రణాళికలు వేయడం గమనార్హం. యుద్ధాలవల్ల అయితేనేమి, మరే ఇతర కా రణాలవల్ల అయితేనేమీ ప్రపంచ స్థాయి లో ఇంధన సంక్షోభం మరోపక్క గత్యంతరం లేని పరిస్థితిలో పునరుత్పాదక ఇంధ న వనరుల ఉత్పాదకతవైపు ప్రభుత్వాలను మళ్లిస్తుందనడంలో సందేహం లేదు.

అధి క ఇంధన ధరలు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయి. అనేక కుటుంబాలను పేదరికంలోకి నెట్టి వేస్తాయి. కొన్ని కర్మాగారాలు ఉత్పత్తిని తగ్గించుకోవలసి వస్తుంది లేదా మూసి వేయవలసిన పరిస్థితులు  రావ చ్చు. పర్యవసానంగా ఆయా దేశాల ఆర్థిక వృద్ధి మందగించే ప్రమాదం ఉంటుంది. 

 -గడీల ఛత్రపతి