17-06-2025 12:00:00 AM
తీవ్ర ఆరోపణలు బయట నుంచి కాకుండా ఇంటిగుట్టును న్యాయమూర్తులే బయట పెట్టుకుంటుంటే, వాటిలోని నిజానిజాలు నిర్ధారించడానికి సుప్రీంకోర్టు లేదా హైకోర్టు అంతర్గత కమిటీలు కాకుండా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర సంస్థ ఉండాలి.
చట్టానికి ఎవరూ అతీతులు కారనేది తరచుగా మనం వింటుం టాం. దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలోని కొన్ని ఉన్నత న్యాయస్థానాల్లోని సంఘటనలు వ్యవస్థను దుర్వినియోగ పరచే విధంగా ఉన్నాయి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో కరెన్సీ నోట్ల కట్టలు అగ్నికి ఆహుతైనాయని, ఆ ఘటనను సాక్ష్యాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారనేది ప్రస్తు త చర్చనీయాంశం.
సుప్రీంకోర్టు నియమించిన న్యాయమూర్తుల కమిటీ సమ ర్పించిన నివేదికను రాష్ట్రపతి, ప్రధానమంత్రికి తదుపరి చర్యలకై సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి పంపించారు. తదనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసనకు చర్యలు చేపడుతున్నారని వింటున్నాం. కానీ, ఈలోపే జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు మెండని కూడా ఊహాగానాలు వస్తున్నాయి.
అదే నిజమైతే అభిశం సన తీర్మానం వీగిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అవినీతి ద్వారా లేదా అక్రమంగా సొమ్ము వెనకేసుకున్నందుకు లేదా ఆ సొమ్మును ప్రభుత్వం రాబట్టుకునేందుకు ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టకుండా విషయాన్ని గాలికి వదిలి వేయటం ఎవరికీ రుచించని అంశం.
జస్టిస్ యశ్వంత్ వర్మను ఢిల్లీ హైకోర్టు నుంచి స్వంత హైకోర్టు (అలహాబాద్)కు బదిలీ చేయటం అనేది శిక్షగా భావించలేం. ఒక ప్రభుత్వ ఉద్యోగి అక్రమంగా ఆర్జిస్తే ప్రభుత్వాలు తీసుకునే క్రిమినల్ చర్యలు హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వర్తించవా? అనేది ప్రతి సామాన్యుడి ప్రశ్న. అభిశంసన దాకా విషయం వెళ్లిందంటే, సుప్రీంకోర్టు నియమించిన కమిటీ జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా నివేదిక ఇచ్చిందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.
ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు తనకు తానుగా క్రిమినల్ చర్యలకు ఆదేశించవలసి ఉండాల్సింది. కో ట్ల డబ్బు అక్రమంగా వెనకేసుకొని, సీబీఐ లేదా అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన ఉద్యోగి ఎవరైనా రాజీనామా చేస్తే, క్రిమినల్ చర్యలు హుష్ కాకి అంటే ప్రతి ఒక్కరూ దానికే ప్రాధాన్యం ఇస్తారు.
అభియోగాలపై క్రిమినల్ చర్యలు?
పదవి నుంచి తొలగించే చర్యలు భార త న్యాయవ్యవస్థ చరిత్రలో మొదటగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వి.రామస్వా మి విషయంలో జరిగింది. ఆయన పంజా బ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సందర్భంలో కొన్ని అవ కతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు. కానీ, ఆ చర్య లోక్‌సభలో విఫలమైంది. ఆయన విషయంలో లోక్‌సభ స్పీకర్ నియమించిన కమిటీ అభియోగాలను నిర్ధారించిం ది.
అయినా, జస్టిస్ వి.రామస్వామి ఆ త ర్వాత కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గా పదవీ విరమణ వయస్సు దాకా కొనసాగారు. ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టలేదు. మరోసారి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు నియమించిన కమిటీ అవినీతి ఆరోపణలను నిర్ధారిస్తూ నివేదిక ఇచ్చింది. పార్లమెంటులో అభిశంసన తీ ర్మానం పెట్టే దశలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
అవినీతి, ఆశ్రిత పక్షపాతం, నిధుల దుర్వినియోగం లాంటి తీవ్ర అభియోగాలు నిర్ధారితమైనప్పటికీ ఎటువంటి క్రిమినల్ చర్యలు లేదా దుర్వినియోగమైన డబ్బు రాబట్టుకోవడానికి ఎటువంటి శాఖాపరమైన చర్యలు చేపట్టలేదు. క్రిమినల్ చర్యల గురించి జడ్జెస్ ఎంక్వయిరీ చట్టం 1968 కూడా సైలెంట్‌గా ఉంది.
ఇదిలా ఉండగా పాట్నా హైకోర్టు వి శ్రాంత న్యాయమూర్తి రాకేశ్ కుమార్‌ది మ రో ప్రహసనం. పదవిలో ఉండగా ఆయన అక్కడి ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేశారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ హైకో ర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయగా 2020లో పదవీ విరమణ చేశారు. తదుపరి 2022లో జాతీయ కంపెనీ లా అప్పి లేటు ట్రిబ్యునల్ జుడీషియల్ మెంబర్‌గా నియమితులయ్యారు.
ఆ సమయంలో జస్టిస్ రాకేశ్‌కుమార్, మరో మెంబర్ సు ప్రీంకోర్టు జారీ చేసిన ఒక ఉత్తర్వును ధిక్కరించారంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి చంద్రచూడ్ వారిద్దరిని ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు ముందు హాజరు కావ లసిందని కోర్టు ధిక్కరణ చట్టం కింద నోటీ సు జారీ చేశారు.
ఈ విషయంలో విచారణ జరపాల్సిందిగా జాతీయ కంపెనీ లా అప్పిలేటు ట్రిబ్యునల్ ఛైర్మన్‌కు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జస్టిస్ రాకేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ కేసును మూసివేసింది. దానికి ప్రత్యామ్నాయంగా జస్టిస్ రాకేశ్ కుమార్ జస్టిస్ చంద్రచూడ్‌పై ఆరోపణలు చేస్తూ నవంబర్ 2024లో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు.
న్యాయ క్రమశిక్షణ అవసరం
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు గుజరాత్ హైకోర్టు బెయిల్ తిరస్కరించగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వేస వి సెలవుల చివరి దినమైన శనివారం రో జు జస్టిస్ చంద్రచూడ్ అసంబద్ధమైన అవసరం కోసం తీస్తా సెతల్వాడ్‌కు బెయిలు మంజూరు చేసే విషయంలో పదవీ దుర్వినియోగం ద్వారా విస్తృత ధర్మాసనాన్ని అక్రమంగా ఏర్పాటు చేశారని,
ఇది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7(సీ), 7ఏ, 8 కింద వర్తిస్తుందని, సీబీఐ ద్వారా విచారణ జరిపిస్తే నిజాలు తెలుస్తాయని ఫిర్యాదు చేయటం జరిగింది. దీనిపై రాష్ట్రపతి ఇటీవలే విచారణకు ఆదేశించారని తెలుస్తున్నది. ఎటువంటి విచారణ అనే దాని విషయంలో స్పష్టత లేదు.
విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ ఖట్జూ ఎన్నోసార్లు ఉన్నత న్యాయవ్యవస్థలో అవినీతి పాతుకు పోయిందని, కేసుల విచారణలో న్యాయ క్రమశిక్షణ లేదని బహిరంగంగా విమర్శించారు. ఇటువంటి తీవ్ర ఆరోపణలు బయ ట నుంచి కాకుండా ఇంటిగుట్టును న్యాయమూర్తులే బయట పెట్టుకుంటుంటే,
వాటి లోని నిజానిజాలు నిర్ధారించడానికి సు ప్రీంకోర్టు లేదా హైకోర్టు అంతర్గత కమిటీలు కాకుండా రిటైర్డ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన స్వతం త్ర సంస్థ ఉండాలి. తగు చర్యలు తీసుకునే నిమిత్తం రాష్ట్రపతికి సిఫారసు చేసే విధంగా ఆ సంస్థకు అధికారమివ్వాలి.
వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి