- మహబూబాబాద్ జిల్లాలో 14,247 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
- 16,547 మంది రైతులకు తీవ్ర నష్టం
మహబూబాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన అకాల వర్షాని కి మహబూబాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు. వరి లో ఇసుకమేటలు వేయగా, పత్తి, మొక్కజొ న్న, మిర్చి పంటలు నీట మునిగాయి. పంట నష్టాన్ని అ ంచనా వేసి రైతులకు ఎకరాకు పదివేల రూ పాయల చొప్పున అందజేయాలని ప్రభుత్వ ం నిర్ణయించింది. ఈ మేరకు వివిధ గ్రామా ల్లో వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో పంట నష్టా న్ని అంచనా వేశారు. జిల్లా వ్యవసాయాధికా రి విజయకుమారి నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. జిల్లాలో మొత్తం 16,547 మ ంది రైతులకు గాను 14,247 ఎకరాల్లో పం ట నష్టం వాటిల్లినట్లు తెలుస్తున్నది. 12,3 71 ఎకరాల్లో వరిపంట దెబ్బతినగా మొక్కజొన్న 993 ఎకరాల్లో పూర్తిగా నేలమట్టమైంది.
ఎకరానికి రూ.౨౦వేలు ఇవ్వాలి
వ్యవసాయాధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో వేల ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొ న్న, పెసర, మిర్చి, బొప్పాయి, అరటి, మున గ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఇప్పటి వరకు ప్రభు త్వం నష్ట పరిహారం అందజేయలేదు. ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం పెట్టుబడికి కూడా సరిపోదని పలువురు రైతులు అంటున్నారు. అయితే కొంతమేరకైనా ప్రభుత్వ సాయం ఉపయోగపడుతుందని భావించినా.. ఇంకా అందకపోవడంతో ఇబ్బందు లు పడుతున్నారు. ఎకరాకు రూ.20 వేల పరిహారం అందజేయాలని రైతులు డిమాం డ్ చేస్తున్నారు.
మూడు ఎకరాల పత్తి నేలమట్టమైంది
నాకున్న మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నేలమట్టమై ంది. చేసేదేమీ లేక రోటోవేటర్‌తో దు న్ని మరో పంటను సాగు చేయాలనుకుంటున్న. పంట నేలమట్టం కావడం తో ఆర్థికంగా నష్టపోయా. ప్రభుత్వం త క్షణమే సాయమందించి ఆదుకోవాలి.
ఆకుల కృషమూర్తి, కోరుకొండపల్లి
కొర్రీలు పెట్టకుండా సాయం అందించాలి
పంట నష్టపోయిన రైతులకు కొర్రీలు పెట్టకుండా ప్రభుత్వం ఎకరాకు రూ.25వేల సాయాన్ని తక్షణమే అందించాలి. తీవ్రంగా దెబ్బతిన్న పంట కాలువలను, చెరువు కట్టలను వెంటనే మరమ్మతులు చేపట్టాలి. త్వరగా పరిహారం అందిస్తే రైతులు మరో పంట వేసుకునేందుకు అవకాశం ఉంటుంది.
బ్రాహ్మణపల్లి అజయ్‌సారథి, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి