calender_icon.png 4 August, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింత తీరేలా చెంతనే మార్కెట్

04-08-2025 12:12:08 AM

  1. గుడి మల్కాపూర్ మార్కెట్ తరలింపునకు సన్నాహాలు

అజీజ్ నగర్లో 150 ఎకరాలు కేటాయించిన సర్కారు

నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న మార్కెటింగ్ శాఖ

రైతులకు తీరనున్న రవాణా, దళారుల కష్టాలు

చేవెళ్ల, ఆగస్టు 03:పశ్చిమ రంగారెడ్డి రైతులకు మార్కెట్ కష్టాలు తీరనున్నాయి. నగ రంలోని గుడి మల్కాపూర్ వద్ద కొనసాగుతున్న మార్కెట్ ను మొయినాబాద్ మున్సి పల్ పరిధిలోని అజీజ్ నగర్కు తరలించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రెవెన్యూ అధికారులు ఇప్పటికే అజీ జ్ నగర్ రెవెన్యూలో బీజాపూర్ హైవే పక్కన ఉన్న 176 సర్వే నెంబర్లో నుంచి 150 ఎకరాలు గుర్తించారు.

ఈ భూమికి త్వరలోనే హద్దురాళ్లు పాతి మార్కెటింగ్ శాఖకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతోందని వారు తెలిపారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులు ప్లానింగ్, ఖర్చులు అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించనున్నారు. 150 ఎకరాల్లో 50 ఎకరాల చొప్పున పూలు, పండ్లు, కూరగాయలు విక్రయించేలా సమీకృత  మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెప్పారు. 

 రైతులకు తప్పని రవాణా కష్టాలు

 చేవెళ్ల నియోజకవర్గంతో పాటు వికారాబాద్ జిల్లా, రైతులు పూలు, పండ్లు, కూరగా యలు, ఆకు కూరలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ పండించే కూరగాయల్లో కేవలం 30 శాతం స్థానిక అవసరాలకు వాడుకొని మిగి తా 70 శాతం హైదరాబాద్ లోని గుడిమల్కాపూర్ , సికింద్రాబాద్ లోని బోయిన్ పల్లి తో పాటు ఇతర మార్కెట్లకు ఎగుమతి చే స్తుంటారు. మూసాపేట,

కూకట్ పల్లి లాంటి చిన్నచిన్న మార్కెట్లతో పాటు నగరంలో సూ పర్ మార్కెట్ల నుంచి చిరు వ్యాపారులకు వరకు ఈ మార్కెటే ఆధారం. అయితే పంట లు పండించడం వరకు బాగానే ట్రాన్స్ పోర్టు ఇబ్బందిగా మారింది. గతంలో గ్రా మాలకు బస్సులు వచ్చేవి. ఆ తర్వాత బ స్సులు రాకపోవడంతో  వ్యాన్, డీసీఎం, టా టా ఏస్ లాంటి ప్రైవేట్ వెహికల్స్ లో నే గు డి మల్కాపూర్ వెళ్తున్నారు.

అదికూడా రాత్రి సమయంలో ప్రయాణం కావడంతో ఎన్నో సార్లు ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాలే కాదు మార్కెట్లో పార్కింగ్ సమస్య కూడా తీ వ్రంగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చే స్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేస్తున్నారని వాహనాల యజమానులు వాపోతున్నారు. 

దళారుల బెడద కూడా..

కేవలం రవాణా కష్టాలే కాదు గుడి మ ల్కాపూర్ మార్కెట్లో దళారుల కారణంగా కూడా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దళారులు, వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రేటును నిర్ణయించడమే కాదు... రైతు నుంచి నిబందనలకు విరుద్ధంగా 10 శాతం కమిషన్ వసూలు చేస్తున్నారు. అంతేకాదు అక్క డ పనిచేసే గుమాస్తాలు, కార్మికులు ‘ముట్టి’ పేరిట కొంత పంటను తీసుకుంటున్నారు.

కూరగాయల మార్కెట్లోనే కాదు పూల మా ర్కెట్లోనూ ఇదే పరిస్థితి. దీనికి తోడు పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంటోంది. వర్షాకాలం వచ్చిదంటే దోమలు బెడద తీవ్రంగా ఉం టుంది. ముఖ్యంగా ఆకుకూరలు అమ్మే మోండాల వద్ద ఈ పరిస్థితి దారుణంగా త యారవుతోంది. దీంతో దోమల తెరలు, దోమలు కరువకుండా శరీరానికి పూసుకునే పేస్టులు తెచ్చుకుంటున్నారు.  బాత్ రూము లు, టాయిలెట్లు కూడా సరిగ్గా లేదు. రాత్రి సమయాల్లో బాత్ రూములు ఉండడం లేద ని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. 

తీరనున్న కష్టాలు

అజీజ్ నగర్ వద్ద మార్కెట్ ఏర్పడితే రవాణాతో పాటు ఇతర కష్టాలు కూడా తీరనున్నాయి. పశ్చిమ రంగారెడ్డి ప్రాంతాలైన వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్, చేవెళ్ల, శంకర్పల్లి, మొయినాబాద్, షాబాద్ ప్రాంతాల రైతులు తాము పండించిన పం టను చెంతనే అమ్ముకునే అవకాశం రానుం ది. పార్కింగ్ , దళారుల సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది.

మహబూబ్ నగ ర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లాలో కలిసిన షాద్ నగర్ , కొత్తూరు, చౌదరిగూడ, కొందు ర్గు, నందిగామ, కేశంపేట్ మండలాల రైతులకు కూడా ఈ మార్కెట్ తో ప్రయోజనం చేకూరనుంది. కాగా, రైతులు తాము పండించిన కూరగాయలు, ఆకు కూరలు పూలు, పండ్లు తరలించేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. 

రైతుల మేలు చేసే నిర్ణయం 

గుడి మల్కాపూర్ మార్కెట్ ను అజీ జ్ నగర్ కు తరలించడం మంచి నిర్ణ యం. ఇది పశ్చిమ రంగారెడ్డి రైతులకు ఎంతో మేలు చేస్తుంది.  రైతులకు దూర భారం, ఖర్చు తగ్గడమే కాదు సమయం కలిసివస్తుంది. దళారుల బెడద కూడా ఉండదు. ప్రభుత్వం 150 ఎకరాలు కేటాయించింది. త్వరలోనే పనులు మొదలవుతాయి. 

సున్నపు వసంతం, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్