04-08-2025 12:12:56 AM
-సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్‌తో నాణ్యత
-మహిళా సమాఖ్యలకు ప్రాధాన్యంతో స్థానిక బలోపేతం
-డాష్‌బోర్డు మానిటరింగ్, ట్రాకింగ్‌తో రియల్ టైమ్ పర్యవేక్షణ
-విద్యార్థులకు హెల్త్‌కార్డులతో తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంపు
హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు రుచికర మైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గణనీయమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ‘హెల్తీ, హైజీన్, టేస్టీ’ ఫుడ్ అనే స్పష్టమైన లక్ష్యంతో, సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్, ఆధునిక వంట సాంకేతికతలు, కఠిన నాణ్యత తనిఖీలను ప్రారంభించింది.
ఇప్పటి వరకు జిల్లాల వారీగా వేర్వేరు సరఫరాదారులపై ఆధారపడే విధానం కారణంగా నాణ్య తలో వ్యత్యాసాలు, రవాణా లోపాలు, రేట్ల భేదాలు ఉండేవి. కొన్నిసార్లు సరఫరా ఆల స్యం కావడం, పదార్థాల నాణ్యత తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తేవి. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో అవసరమైన అన్నీ పదార్థాలను ఒకే ప్రమాణంతో, ఒకే రేటుకు కొను గోలు చేసి జిల్లాల వారికి పంపే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సరఫరా సజావుగా, సమయానికి నాణ్యత తో జరిగేందుకు అవకాశం ఉంటుంది.
స్థానిక బలోపేతానికి మహిళా సమాఖ్యలకు ప్రాధాన్యం..
మహిళా మండల సమాఖ్యలు, జిల్లా మ హిళా సమైఖ్యల ద్వారా సరఫరా పనులను అప్పగించడం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. స్థానిక స్థాయిలో మహిళలు పర్యవేక్షణ చేయడంతో నాణ్యతపై అదనపు దృష్టి కూడా ఉంటుంది.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు అలాగే వారి సంక్షేమం, ఉజ్వల భవిష్యత్‌కు ఈ మెనూ అమలు ఎంతో ప్ర యోజనం చేకూరుతుందని అధికారులు చె బుతున్నారు. దీనికి తోడు టెండర్ ప్రక్రియలో నిర్ధారిత ధర మాత్రమే పాటించను న్నారు. సరఫరా ఏజెన్సీల ఎంపిక లాటరీ పద్ధతిలో జరగడం వల్ల కాంట్రాక్టర్ల మధ్య అనవసర ధరల పోటీ ఉండదు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా పారదర్శకంగా టెండర్లు జరుగుతాయి.
క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్..
సరఫరా చేసే ఏజెన్సీలు నాణ్యత, పరిమాణం, సమయపాలన తప్పనిసరిగా పా టించాలి. ఇందుకోసం డాష్‌బోర్డు మానిటరింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఏ రోజు ఏ పదార్థాన్ని ఎంత పరిమాణంలో వాడుతున్నారో, మెనూ పూర్తిగా అమలవుతుందో, లేదో రియల్ టైమ్‌లో ఆన్‌లైన్‌లో కనిపిస్తుం ది. మెనూ పకడ్బండీగా అమలు కావడానికి ఎలాంటి ఆలస్యం కాకుండా, సమయానికి అందేలా ట్రాకింగ్ సిస్టమ్‌ను అమలు చేస్తున్నారు. ఆహార నాణ్యత కోసం స్టీమ్ కుకింగ్ తప్పనిసరి చేశారు.
వండిన పదార్థాలను స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రల్లోనే నిల్వ చేయాలని, ప్లాస్టిక్, అల్యూమినియం పాత్రలను పూర్తిగా నిషేధం విధించారు. తద్వారా విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ లభిస్తుంది. ప్రతినెలా యాదృచ్ఛికంగా ఆహార నమూనాలు సేకరించి, గుర్తింపు పొందిన ఫుడ్ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేస్తారు.
నిబంధనలకు విరుద్ధమని తేలితే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రతీ విద్యార్థికి బరువు, హిమోగ్లోబిన్ స్థాయి, బీఎంఐ వంటి వివరాలు ఉండే హె ల్త్ కార్డు ఇస్తారు. త్రైమాసికం వారీగా వీటిని సమీక్షిస్తారు. దీని ద్వారా ఆహారం వల్ల ఆరోగ్యంలో వచ్చిన మార్పులు తెలుసుకోవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బందికి టో ల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. అందిన ఫిర్యాదులు 48 గంటల్లో పరిష్కరించాలి.
సీఎం, మంత్రి ప్రత్యేక పర్యవేక్షణ: ఎస్సీ గురుకులాల కార్యదర్శి అలుగు వర్షిణి
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్వయంగా జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ, నాణ్యతపై రాజీ పడొద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఈ విధానం అమలవుతుంది. అధికారులు కూడా ఈ మోడల్‌ను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారుస్తామనే నమ్మకంతో ఉన్నారు.
కొత్త కాంట్రాక్టర్లు సెప్టెంబర్ 5వ తేదీ నుంచి విధుల్లోకి వస్తారు. ఆ రోజు నుంచి అన్ని గురుకులాల్లో ఒకే రకం నాణ్యమైన, పరిశుభ్రమైన, రుచికరమైన భోజనం అందుతుంది. ఈ మార్పు లతో విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా సం తృప్తిగా ఉంటుందుని చెబుతున్నారు. ఈ వి ధానం అమలుతో విద్యార్థుల శారీరక, మా నసిక వికాసానికి తోడ్పాటు లభిస్తుంది.