11-08-2025 08:10:42 PM
డాక్టర్ ప్రేమ్ కుమార్..
గద్వాల టౌన్: జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని మున్సిపాలిటీ అధికారులు పర్యటించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక వార్డు ప్రజలతో కలిసి అదనపు కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, వార్డులో రహదారి పాడైపోయిందని, రైల్వే సబ్ వే నిర్మాణం జరుగుతున్న కారణముగా రోడ్డు అస్తవ్యస్తంగా మారిందన్నారు. అదేవిదంగా గద్వాల కోట బురుజు శిథిలావస్థలో ఉన్నందున అక్కడ కూడ పర్యటించి అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించవాల్సిందిగా కోరుతున్నామన్నారు.