calender_icon.png 11 August, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాపూర్ లో పోలీసుల విస్తృత తనిఖీలు

11-08-2025 08:21:28 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): కాసిపేట మండలం(Kasipeta Mandal)లోని దేవాపూర్ గ్రామంలో గల గొల్లవాడ, రాంపూర్ ప్రాంతాల్లో సోమవారం మందమర్రి సీఐ శశిధర్ రెడ్డి(CI Shashidhar Reddy) నేతృత్వంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. గ్రామాలలో ఎవరైనా అపరిచిత వ్యక్తులకు ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారించారు. గ్రామాల్లోని ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుతో పాటు గుర్తింపు కార్డులను పరిశీలించారు. ఈ గ్రామాల్లో నివసించే ప్రజల ద్విచక్ర వాహనాలకు సంబంధించి డ్రైవింగ్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించి పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలను గుర్తించి జరిమానాలు విధించారు.

నెంబర్ ప్లేట్లు లేని రెండు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలకు సైబర్ క్రైమ్, గంజాయి నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, ట్రాఫిక్ రూల్స్, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై, గుడుంబా అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్, కాసిపేట, రామకృష్ణాపూర్ ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.