calender_icon.png 12 August, 2025 | 12:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవోకు వినతి

11-08-2025 08:28:38 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామంలో గల ఎస్సీ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు ఎంపీడీవో శ్రీనివాస్(MPDO Srinivas)కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షం పడితే ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బోయపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ సర్వీస్ రోడ్ కిందికి ఉండడం వల్ల నీరు వెళ్లే మార్గంలో ప్రైవేటు వ్యక్తుల ఫామ్ హౌస్ లు ఉండడం వల్ల నీరు ఇండ్లలోకి వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు.