calender_icon.png 12 August, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆల్బెండజోల్ మాత్రలు వేసిన జిల్లా కలెక్టర్

11-08-2025 08:30:27 PM

1 నుండి 19 సంవత్సరాల పిల్లలందరూ వేసుకోవాలి

కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్(District Collector Ashish Sangwan) సోమవారం ప్రారంభించారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నులిపురుగుల నివారణకు 1 నుండి 19 సంవత్సరాలలోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ తెలిపారు. నులిపురుగుల వల్ల సంభవించు రక్తహీనత, ఆకలి లేమి, మానసిక ఆరోగ్యపరంగా ఎదుగుదల వంటి వ్యాధుల నుండి దూరంగా ఉండి విద్యార్థులందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

ఈ నెల 18 వరకు వేయించుకోవాలని సూచించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం నులిపురుగుల నివారణ దినోత్సవం 2025 సంవత్సరానికి జిల్లాలో అన్ని పాఠశాలలో, అంగన్వాడీలలో, ఇంటర్మీడియట్ కళాశాలలో 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు (ఆల్బెండజోల్)లను వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి చంద్రశేఖర్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, రాజు  జిల్లా విద్యా శాఖ అధికారి,  ప్రభు కిరణ్ డిప్యూటీ డిఎంహెచ్ఓ,డాక్టర్ విద్యా  జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి , మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.