11-08-2025 08:18:25 PM
మేడిపల్లి: సెల్ ఫోన్ దొంగ అరెస్టు అయిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్(Medipally Police Station) పరిధిలో జరిగింది. మేడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భీమ్ రెడ్డి నగర్ లో నివసించే సలీం పనినిమిత్తం బస్ స్టాప్ లో ఈరోజు ఉదయం ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా బస్సులోని ఒక వ్యక్తి తన పై జేబులో ఉన్న సెల్ ఫోన్ ను దొంగలిస్తుండగా వెంటనే అప్రమత్తమై, దొంగను పట్టుకొని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని సెల్ఫోన్ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తి నరేష్(20) ను విచారించగా తాను చెడు అలవాట్లకు బానిసై మొబైల్ ఫోన్లు దొంగలించి సొమ్ము చేసుకుంటున్నానని తెలిపాడు. నరేష్ పై కేసు నమోదు చేసుకొని రిమాండ్ కు తరలించామని, ప్రజలు బస్సు ఎక్కేటప్పుడు తమ సెల్ ఫోన్ ను, విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.