calender_icon.png 11 August, 2025 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచు లక్ష్మి మంచి మనసు

11-08-2025 08:12:55 PM

చేవెళ్ల: సినీ నటి మంచు లక్ష్మి మంచి(Actress Manchu Lakshmi) మనసును చాటుకున్నారు. సోమవారం శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామంలోని ప్రభుత్వ స్కూల్లో బాలికలకు తన ‘టీచ్ ఫర్ చేంజ్’ సంస్థ, రత్నా రెడ్డి ‘వేని రావు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే యాదయ్య(MLA Yadaiah)తో కలిసి శానిటరీ ప్యాడ్స్, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మంచు లక్ష్మి తన నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీమన్నారు. విద్యార్థుల కోసం డిజిటల్ స్మార్ట్ క్లాస్‌రూమ్‌ను అందుబాటులోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంచు లక్ష్మి మాట్లాడుతూ...  టీచ్ ఫర్ చేంజ్, వేని రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికల ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 45 స్మార్ట్ క్లాస్‌రూమ్‌ లు ఏర్పాటు చేశామని,  జన్వాడలో మరో 2 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.