11-08-2025 08:23:09 PM
భక్తి శ్రద్ధలతో అన్నదానం..
సనత్‌నగర్ (విజయక్రాంతి): సనత్‌నగర్ డివిజన్(Sanatnagar Division)లోని నాగరాజ రాజేశ్వరి నగర్‌లో, నాగరాజ రాజేశ్వరి దేవాలయం 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు కొలను బాల్‌రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం, భక్తులందరికీ ఉచితంగా అన్నదాన మహోత్సవం నిర్వహించారు, వందలాది మంది భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి, సంతృప్తి వ్యక్తం చేశారు. అన్నదాన సేవలో స్థానిక భక్తులు, సేవా సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొలను బాల్‌రెడ్డి మాట్లాడుతూ, అన్నదానం మహాదానం. అమ్మవారి ఆశీస్సులతో భక్తులందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, జి. నరసింహ, రాము, జి. రాజు తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం చేశారు.