09-01-2026 12:51:08 AM
ఆమనగల్లు, జనవరి 8(విజయక్రాంతి): రీచార్జిటిక్ కమిషనర్ సుధీర్ బాబును గురువారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సిపి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు.
నూతనంగా ఏర్పాటుచేసిన ఆమనగల్లు ఏసీపీ కార్యాలయాన్ని మహేశ్వరం డీసీపీ పరిధిలోకి మార్చాలని, కడ్తాల్ పోలీస్ స్టేషను ఆమనగల్లు ఏసీపీ పరిధిలోకి తీసుకురావాలని వినతిపత్రం అందజేశారు. శాంతి భద్రతలు,పరిపాలన సౌలభ్యం కోసం ఈ మార్పులు చేయాలని కోరారు.