09-01-2026 12:52:29 AM
బీజేపీ మాజీ మున్సిపల్ కౌన్సిలర్:సముద్రాల హంస రాణి కృష్ణ గౌడ్
మేడ్చల్ అర్బన్ జనవరి 8 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి ప్రాంతంలో గల కండ్లకోయలో గల అంగన్వాడి కేంద్రంలో ఎస్.బి.ఐ పాన్ ఇండియా సి.ఎస్.ఆర్ యాక్టివిటీస్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రానికి ఎల్‌ఈడి టీవీ తో సహా అనేక రకాల ఉపకరణాలను పిల్లలకు ఇచ్చినందుకు బిజెపి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ జిల్లా ఉపాధ్యక్షురాలు సముద్రాల హంస రాణి కృష్ణ గౌడ్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మిత్ర హోలిస్టిక్స్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి పాల్గొని పిల్లలకు తినే ప్లేట్లు, ఎల్‌ఈడి టీవీ, వాటర్ బాటిల్స్, బ్యాగులను అందజేయడం జరిగిందని ఎస్.బి.ఐ మేడ్చల్ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కండ్లకోయ అంగన్వాడి కేంద్రంలోని పిల్లలకు రైస్ కుక్కర్, వాటర్ ఫిల్టర్, స్టీనర్, స్టీల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, పలకలు, బుక్స్, పెన్సిల్లను అందజేసినట్లు మాజీ కౌన్సిలర్ హంస రాణి కృష్ణగౌడ్ వెల్లడించారు.
అంగన్వాడి కేంద్రంలో చదువుకుంటున్న పిల్లలకు ఎస్.బి.ఐ బ్రాంచ్ యాజమాన్యం ఉపకరణాలను అందించిన సందర్భంగా మాజీ కౌన్సిలర్ హంసారాని కృష్ణ గౌడ్ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా సీనియర్ నాయకులు సముద్రాల కృష్ణ గౌడ్.అంగన్వాడి సూపర్వైజర్ హైమావతి, అంగన్వాడి టీచర్ లు లత, సుధారాణి, ఆయమ్మలు పిల్లలు తల్లిదండ్రులు పాల్గొన్నారు.