28-01-2026 12:00:00 AM
నంగునూరు,జనవరి 27,(విజయక్రాంతి): పదుల సంఖ్యలో వానరాలు రోడ్డుపైకి వచ్చి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. నంగునూరు మండలం అక్కెనపల్లి వంతెన వద్ద గుంపులు, గుంపులుగా కోతు లు రావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పొలాలపై వానర దం డు పడి కోతకు వచ్చిన మొక్కజొన్న పంట ను నాశనం చేస్తున్నాయి. వీటిని అడ్డుకోబోయిన రైతులపై కోతులు ఎదురుదాడికి దిగు తుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.