28-01-2026 12:00:00 AM
మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా సాఫీగా నిర్వహించాలి
నిజామాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): ఎలాంటి అవాంతరాలు, లోటుపాట్లకు తావులేకుండా మున్సిపల్ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, సాఫీగా జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీ.జీ.పీ శివధర్ రెడ్డిలతో కలిసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలి పారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా పర్యవేక్షణ జరపాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఎన్నికల సం ఘం నియమ, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని అన్నారు.
జిల్లాలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయని, మొత్తం 146 వార్డులకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఎన్నికల షెడ్యూల్ ను అనుసరిస్తూ బుధవారం నుండి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు వీలుగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నిజామాబాద్ నగరం, బోధన్ పట్టణాలలో ఎన్నికల భద్రత విషయంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మని, అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ జరిపిస్తామని అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. నోడల్ అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు తావు లేకుండా, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నికల నియమావళిని తు.చ తప్పక పాటించాలని, మున్సిపల్ పట్టణ పరిధిలో రాజ కీయ పార్టీల బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, ఫోటోలు, ఇతర ప్రచార సామాగ్రిని తొలగించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదే శించారు.
నామినేషన్ సెంటర్లలోని అన్ని గదులకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అలాగే నిబంధనల ప్రకారం అన్ని సౌక ర్యాలు కల్పించాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో పొలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, కామారెడ్డి ఇంచార్జి అదనపు కలెక్టర్ మధుమోహన్, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, కిరణ్మయి, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.