28-01-2026 12:00:00 AM
కామారెడ్డి అర్బన్, జనవరి 27, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో గ్రామ పంచాయతీ సహకారంతో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి పర్యవేక్షణలో YRG CARE లింక్ వర్కర్ స్కీమ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం ఆరోగ్య, రక్త పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పి హెచ్ సి వైద్యులు సురేష్, లింకు వర్కర్ స్కీమ్ డిఆర్పి సుధాకర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ హెచ్‌ఐవి, ఎయిడ్స్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు.
సుఖ వ్యాధులపై నిర్లక్ష్యం చేయరాదన్నారు. హెచ్‌ఐవి వ్యాధిగ్రస్తులపై చిన్న చూపు చూడరాదన్నారు. శిబిరంలో 79 మంది రక్త పరీక్షలు చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ బండి ప్రవీణ్, ఉప సర్పంచ్ హన్మోల్ల నవీన్, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, ల్యాబ్ టెక్నీషియన్ పవన్, వార్డు సభ్యులు, వై ఆర్ జి కేర్ లింక్ వర్కర్ వరలక్ష్మి, ఆరోగ్య సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.