calender_icon.png 29 January, 2026 | 8:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జనసేన పోటీ వెనుక ఉద్దేశం!

13-01-2026 12:00:00 AM

తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపులో ఉంది. సుమారు దశాబ్ద కాలం పాటు ఏకఛత్రాధిపత్యం వహించిన బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోవడం, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగేందుకు ప్రయత్నించడం ఒకెత్త యితే, ఇప్పుడు జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగడం, కల్వకుంట్ల కవిత ‘సొంత కుంపటి’ పెట్టుకోవడం రాష్ర్ట రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలే పాయి. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కేవలం స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునే ప్రక్రియ మాత్రమే కాదు, ఇది రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిగా మారనుంది.

అయితే ఆంధ్రప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా పోటీచేసి ఘన విజయం సాధించి ఆ రాష్ర్టంలో అధికారాన్ని చేజిక్కించుకున్న నమూనాను తెలంగాణలో సైతం ప్రయోగించాలనే ఆలోచనలకు ఇది ఒక ముందస్తు ప్రయోగమా లేక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి రాష్ర్టంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊతమిచ్చే ప్రయత్నంలో భాగమా? లేక సుడిగాలిలా చుట్టుకు వస్తున్న ‘తెలంగాణ జాగృతి’తో అంటకాగి అది ఒక రాజకీ యపార్టీగా వేళ్లూనుకునేందుకు సహకరించే లోపాయికారీ ఒప్పందమా? అనే అనుమానాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో సాక్షాత్కరిస్తున్నాయి. 

పంచాయతీ జోష్.. 

ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎ న్నికల్లో కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. సుమారు 70 శాతం పైగా సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకోవడం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల్లో ఉన్న సానుకూలతకు నిదర్శనంగా కనిపిస్తోంది. అయితే, ఇదే సమయంలో జనసేన పార్టీ సైతం తన ఉనికిని బలంగా చాటుకుంది. పవన్ కళ్యాణ్ ప్రకటించిన గణాంకాల ప్రకారం, జనసేన మద్దతుదారు లు తెలంగాణ వ్యాప్తంగా 53 గ్రామాల్లో సర్పంచులుగా గెలుపొందడం ఆ పార్టీ శ్రేణు ల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణ గడ్డపై జనసేన సాధించిన ఈ విజయం పార్టీని మున్సిపల్ ఎన్నికల వైపు నడిపించింది.

మరోవైపు, జూ బ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పట్టణ ప్రాంతా ల్లో రాజకీయ పరిపక్వతను సూచిస్తోంది. కాంగ్రెస్ సుమారు 25 వేల ఓట్ల మెజార్టీతో జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వా రా పట్టణ ఓటర్లు కూడా అభివృద్ధి, స్థిరత్వం వైపు మొగ్గు చూపుతున్నారని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లను ఆకర్షించడం బీజేపీ, బీఆర్‌ఎస్, జనసేనలకు పెద్ద సవాలుగా మారింది.

ఓట్ల చీలికతో లాభనష్టాలు..

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేయ డం వల్ల ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కంటే, ఆ పార్టీ చీల్చే ఓట్లు ఏ పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తాయన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏపీలో బీజేపీ-జనసేన, -టీడీపీ కూటమిగా ఉన్నప్పటికీ, తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. జాతీయవాదం, హిందూత్వ భావజాలం పేరుతో యువత ఓట్లపై ఆధారపడే బీజేపీకి, అదే సామాజిక వర్గాల్లో బల మైన ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ అడ్డుగోడగా మారే అవకాశముంది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పడాల్సిన సంప్రదాయ ఓట్లు జనసేన వైపు మళ్లితే, అది పరోక్షంగా కాంగ్రెస్‌కు లాభం చేకూరుస్తుంది. హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు కీలకం. గ త పదేళ్లుగా ఈ ఓట్లు ఎక్కువగా బీఆర్‌ఎస్ వైపు నిలిచాయి. కానీ, ఏపీలో కూటమి ప్ర భుత్వం అధికారం చేపట్టడం, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడం వంటి పరిణామాలు సెటిలర్ల ఆలోచ నా దృక్పథాన్ని మార్చవచ్చు.

ఒకవేళ ఈ ఓట్లు జనసేన వైపు మళ్లితే, బీఆర్‌ఎస్ పట్టణ ప్రాంతాల్లో తన పట్టును కోల్పోయే ప్రమా దం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 20 స్థానాలను బీఆర్‌ఎస్ గెలుచుకోగా, ఎంఐఎం తన ఏడు స్థానాలపై పట్టు నిలుపుకోగా, బీజేపీ గోషామహల్ స్థానం గెలుచుకుంది. రాష్ర్టంలో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో మాత్రం ఒక్క స్థానా న్ని కూడా గెలుచుకోలేకపోయింది. అయితే జూబ్లీహిల్స్ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ 25 వేల ఓట్ల మెజార్టీతో ఆ స్థానాన్ని కైవసం చేసుకుని బోణీకొట్టింది. 

సొంత గూటిపైనే యుద్ధం..

మరోవైపు బీఆర్‌ఎస్ నుంచి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత  తెలంగాణ రా జకీయాల్లో మరో కొత్త శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. శాసనమండలిలో ఆమె చేసిన భావోద్వేగ ప్రసంగం, సొంత పార్టీలోనే తనను అణగదొక్కారని చేసిన ఆరోపణలు బీఆర్‌ఎస్‌లో గందరగోళాన్ని సృష్టించాయి. ‘తెలంగాణ జాగృతి’ని రాజకీయ పార్టీగా మార్చి, ‘సామాజిక తెలంగాణ’ నినాదంతో ఆమె ముందుకు వస్తున్నారు. కవిత, జనసేన పార్టీల మధ్య ప్రస్తుతం ఎ లాంటి పొత్తు సంకేతాలు లేకపోయినా, వీరిద్దరి లక్ష్యం మాత్రం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదగడమే.

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుని తామే అధికారాన్ని కైవసం చేసుకుంటామని పదేపదే ప్రకటిస్తున్న బీజేపీ ప్ర స్తుతం అంతర్గపోరుతో సతమతమవుతున్న తరుణంలో మూడో ప్రత్యామ్నాయంగా ప్రవేశించడానికి ఇదే సరైన సమయమని తెలంగాణ జాగృతి, జనసేన భావిస్తున్నా యి. కవిత  పార్టీ గ్రామీణ స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్‌ను, జనసేన పట్టణ ప్రాం తాల్లో యువతను ఆకర్షించగలిగితే, రాను న్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయం చతుర్ముఖ పోటీగా మారు తుందనే అంచనాలున్నాయి.  తెలంగాణ ప్ర జల నుంచి పెద్దగా ప్రతిస్పందన లేదనే నిరుత్సాహ వాతావరణం నుంచి బయటపడ టానికి పవన్ కల్యాణ్ లాంటి సినీగ్లామర్‌ను కవిత ఆశ్రయించే అవకాశాలు లేకపోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి. 

సవాల్‌తో కూడిన ఎన్నికలు..

రాజకీయాల్లో ప్రకటనలు చేయడం సులభం, కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమ లు చేయడం కష్టం. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల సమయంలో పోటీ చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గడం వల్ల ఆయన ‘పార్ట్ టైమ్’ పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ పాలనలో బిజీగా ఉంటూ, పవన్ తెలంగాణలో పార్టీని ఎంతవరకు సమన్వయం చేయగలరనేది సందేహ మే. అలాగే, కవిత  తిరుగుబాటు కేవలం రాజకీయ మనుగడ కోసమా లేక సిద్ధాంతపరమైనదా? అనే ప్రశ్నలు ప్రజల్లో ఉన్నా యి. పుర ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేనకు గతానుభవాలు, పవన్ వ్యాఖ్యలు సవాలుగా మారనున్నాయి. గతంలో రాష్ర్ట విభజనపై ఆయన చేసిన ‘ఉపవాసం’ వ్యా ఖ్యలు, ఇటీవలే కోనసీమ పర్యటనలో ఏపీ అభివృద్ధిపై ‘తెలంగాణ నరదిష్టి’ తగిలిందని చేసిన వ్యాఖ్యలు ప్రత్యర్థులకు బలమైన అస్త్రాలుగా మారబోతున్నాయి.

ఈ వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు పవన్ కళ్యాణ్‌ను ‘తెలంగాణ వ్యతిరేకి’గా చిత్రీకరించే అవకాశముంది. తాను ‘తెలంగాణవాదిని’ అని నిరూపించుకోవడానికి పవన్ ఈ ఎన్నికల్లో ఏ విధమైన వాద నను వినిపిస్తారనేది కీలకం. విభజన తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఒక సభలో పవన్ మాట్లాడుతూ, ‘ఆంధ్ర నేతలను తిడితే నేను సహించను’ అని హెచ్చరిస్తూనే, తెలంగాణ ఉద్యమానికి కూడా మద్దతు ప్రకటించడం గందరగోళానికి దారితీసింది. జనసేన పార్టీ తొలి ఎంపీటీసీ స్థానాన్ని గెలిచింది కూడా తెలంగాణలోనే అని గుర్తు చేస్తుంటారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు రాబోయే రాజకీయ యుద్ధానికి ఒక రిహార్సల్ లాంటి వి. ఒకవైపు అభివృద్ధి మంత్రంతో కాంగ్రెస్, మరోవైపు ఉనికిని కాపాడుకోవాలని బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ పోరాడుతుంటే.. జనసేన, కవితల రూపం లో కొత్త శక్తులు రంగప్రవేశం చేశాయి. ఓట్ల చీలిక సమీకరణాలు ఏ పార్టీకి బూస్ట్‌నిస్తాయి, ఏ పార్టీని అగాధంలోకి నెడతా యనేది తెలియాలంటే ఫిబ్రవరి వరకు వేచి చూడాల్సిందే.

పిట్టల రవీందర్