calender_icon.png 5 May, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి..

05-05-2025 04:47:56 PM

సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు..

మునుగోడు (విజయక్రాంతి): మే 20న దేశవ్యాప్త సమ్మెకు అన్ని వర్గాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని సిఐటియు మండల కన్వీనర్(CITU Mandal Convener) వరికుప్పల ముత్యాలు అన్నారు. సోమవారం మే డే వారోత్సవాల్లో భాగంగా మునుగోడు మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో ఉన్న జెండాను గ్రామపంచాయతీ కార్మికులు, భవన కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. కార్మికులకు ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమ పథకాలు అందించకుండా కార్మికుల హక్కులను ప్రభుత్వలు కాలరాస్తూ కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాసే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాయని విమర్శించారు.

కార్మికులకు ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను కార్మికుల సద్వినియోగం చేసుకోవాలని కార్మికులకు సూచించారు. కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించేది సిఐటియు అని అన్నారు. కార్మికులకు ఎక్కడ అన్యాయం జరిగిన సిఐటియు అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు మిర్యాల భరత్, యాస రాణి శ్రీను, వేముల లింగస్వామి, జీడిమడ్ల సైదులు, నూకల పెద్దమ్మ, అండాలు, అరుణ, పెరమళ్ళ రాజు, వేముల విజయ్, పావని, సంపూర్ణ, యాదమ్మ, దుర్గయ్య తదితరులు ఉన్నారు .