05-05-2025 04:43:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్(MLA Dr. Jatoth Ramachandru Naik) డాక్టర్ ప్రమీల దంపతులు సోమవారం మహబూబాబాద్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయంలో కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ జన్మదినంతో పాటు వివాహ వార్షికోత్సవం కావడంతో వీరభద్ర స్వామి భద్రకాళి అమ్మ వార్లను దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలతో పాటు వివాహ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.