calender_icon.png 5 May, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్టాండులో చలివేంద్రం ఏర్పాటు

05-05-2025 04:53:20 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కురవి ఆర్టీసీ బస్టాండ్ లో కురవి భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయ మాజీ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్ తండ్రి సోమిశెట్టి వీరభద్రం  జ్ఞాపకార్ధం ప్రయాణికుల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేశారు. మే, జూన్ రెండు నెలల పాటు చలివేంద్రాన్ని కొనసాగిస్తామని తెలిపారు. చలివేంద్రాన్ని సోమవారం మహబూబాబాద్ ఆర్టీసీ డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ గోపు శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రయాణికుల దాహార్తి తీర్చడం కోసం మంచి హృదయంతో ముందుకు వచ్చిన దాత సోమిశెట్టి శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్, స్థానిక నాయకులు ఎర్ర నాగేశ్వరరావు, అవిరె మోహన్ రావు, దైద భద్రయ్య, బాదె శ్రీనివాస్, కానుగంటి సత్యనారాయణ, బాదె వీరభద్రం, తోట వెంకన్న,  బాదె సైదులు,  కన్నె వెంకన్న, మాచర్ల ఉప్పలయ్య, ఆర్టీసీ డ్రైవింగ్ ఇన్సిపెక్టర్  వెంకన్న, కొంపెల్లి లక్ష్మీనారాయణ, సంద వెంకన్న పాల్గొన్నారు.