18-12-2025 12:42:00 AM
బూర్గంపాడు,డిసెంబర్17,(విజయక్రాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మోరంపల్లి బంజర్,వేపలగడ్డ,నకిరిపేట గ్రామపంచాయతీల సర్పంచులుగా ఎన్నికైన బొర్రా సుభద్ర,బొల్లి నిరోషా,సర్పా నాగమణి, వార్డ్ సభ్యులు బుధవారం మణుగూరు ఎమ్మెల్యే స్వగృహంలో కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని పాయం వెంకటేశ్వర్లు అభినందించి,సత్కరించారు.
ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని నూతనంగా ఎన్నికైన సర్పంచులు,వార్డు సభ్యులు సద్వినియోగం చేసుకొని, గ్రామాభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే ఆకాక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బట్టా విజయ్ గాంధీ,నాయకులు కైపు రామచంద్రారెడ్డి, చేతుల చిన్న వీర్రాజు,మూల నాగిరెడ్డి,యారం నాగిరెడ్డి,హనీఫ్,అజయ్ తదితరులు పాల్గొన్నారు.