18 April, 2026 | 2:30 PM

వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే

06-12-2025 12:00 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 5 (విజయ క్రాంతి): నార్నూర్ మండలంలోని పలు గ్రామ పంచాయితీలలో సర్పంచ్  అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించిన  నాయకులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మె ల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రానన్ను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా పూర్తిస్థాయి ఐకమత్యంతో పని చేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను, కార్యకర్తలకు సూచించారు.

ప్రతి కార్యకర్త పార్టీ సైనికుడిగా పనిచేస్తే రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని  ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం హనుమంత్ రావు, మెస్రం రూప్ దేవ్ పటేల్, జాదవ్ శ్రీరామ్, ఊర్వేత రూపుదేవ్, కనక ప్రభాకర్, తొడసం నాగో రావ్, మడావి రూప్ దేవ్, సుభాష్ రాథోడ్, గోడం ధర్ము, సలాం, కేశవ్, మెస్రం మాణిక్ రావు, తదితర నాయకులు పాల్గొన్నారు.