ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్ నవంబర్ 5( విజయ క్రాంతి); కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు తొలిదశ ర్యాండ మైజేషన్ మండలాల వారిగా నిర్వహించారు. ఈ ర్యాండమైజేషన్ ప్రక్రియలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు.
ర్యాండమైజేషన్ ప్రక్రియ అనం తరం కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాల్లో ఎన్నికల విధులు నిర్వహించేందుకు సరిపడినంత మంది పిఓ, ఓపిఓ లను నియమించనున్నారు. ఎన్నికల నిర్వహణకు సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అవసరానికి 20 శాతం అదనంగా అధికారులను నియమించుకున్న ట్లు పేర్కొన్నారు. దీనిద్వారా ఎన్నికల నిర్వహణలో అధికారుల కొరత తలెత్తకుండా ఉంటుందన్నారు. ఈ ర్యాండమై జేషన్ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, డిపిఓ శ్రీనివాస్, డిఈఓ భోజన్న, ఇతర అధికా రులు తదితరులు పాల్గొన్నారు.






