24-05-2025 12:31:17 AM
జిల్లా రిసోర్స్ పర్సన్స్ దయాకర్, శ్రీనివాస్
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మే23: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని జిల్లా రిసోర్స్ పర్సన్ గోదేశి దయాకర్,నల్ల శ్రీనివాసులు కోరారు.శుక్రవారం జాజిరెడ్డిగూడెం మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల 4వ రోజు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎఫ్‌ఎల్‌ఎస్ ప్రోగ్రాంలో నూతన సాంకేతికతను ఉపయోగించుకుని విద్యార్థుల ప్రగతి అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా బోధన విధానంలో మార్పులను తీసుకొని జరపాలని కోరారు.విద్యార్థుల నమోదు విషయంలో ప్రత్యేక దృష్టి సారించి ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బి బాలునాయక్,ఆర్పీలు వి సైదులు,సీహెచ్ నాగరాజు,కే రమేష్,పి మల్లయ్య,బి శ్రీనివాస్,ఆర్ సృజన,ఎన్ వెంకన్న,స్వరూపారాణి,వివిధ పాఠశాలల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.