calender_icon.png 25 May, 2025 | 10:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నరెడ్ల శ్రీనివాస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం

24-05-2025 12:31:53 AM

 రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, మే 23 (విజయ క్రాంతి):  సామాజిక ఉద్యమకారుడు, లోక్ సత్తా నాయకుడు న రెడ్ల శ్రీనివాస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మం త్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం కరీంనగర్ ఫిలిం సొసైటీ లో  నరేడ్ల శ్రీనివాస్ విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేడ్ల శ్రీనివాస్ సామాజిక ఉద్యమకారుడు ,లోక్ సత్తా ఉద్యమ నాయకుడు , వినియోగదారుల పక్షాన పోరాడారనీ, మాజీ మంత్రి చొక్కారావు దగ్గర అనేక అంశాల పై చర్చించే వాళ్ళమని అన్నారు. 1987 లో ఎస్ ఆర్ ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడు అయినా తరువాత చొక్కారావుతో, సత్యనారాయణ రావుతో సన్నిహితం ఏర్పడిందన్నారు.

శ్రీనివాస్, నేను మహారాష్ట్ర రాలేగావ్ సిద్ధి  వెళ్ళి అక్కడ నీటి వినియోగాన్ని పరిశీలించామని అన్నారు. శ్రీను అన్న కి ఇంట్లో మంచి సపోర్ట్ ఉండేదని, 2004 లో నేను ఎమ్మెల్యే గా పోటీ చేసినప్పుడు యూనియన్ బ్యాంక్ కి వెళ్తే ల్యాండ్ పేపర్స్ పెట్టినప్పుడు ఎంతో సహాయం చేశారని గుర్తు చేశారు.

తన వృత్తి జీవితం బ్యాంక్ ఉద్యోగిగా కూడా అనేక మందికి సహాయం చేశారని, బ్యాంకు లో స్కీమ్స్, లోన్స్ ఇప్పించారని అన్నారు. నీతి నిజాయితీ, పారదర్శకంగా ఉండాలని శ్రీను అన్న దగ్గర అనేక మంచి విషయాలు నేర్చుకున్నామని అన్నారు. చొక్కా రావు ఎలా మర్చిపోలేమో, శ్రీనివాస్ ను కూడా మర్చిపోలేమని అన్నారు. కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షుడు పొన్నం రవిచంద్ర, తదితరులు పాల్గొన్నారు.