calender_icon.png 25 May, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన

24-05-2025 12:30:26 AM

పాల్గొన్న ఆది శ్రీనివాస్, జువ్వాడి కృష్ణారావు 

జగిత్యాల, మే 23 (విజయక్రాంతి): జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ కోరుట్ల మండలం చిన్న మెట్టుపల్లి గ్రామంలో శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్ర మం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో  రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పన్నాల అంజిరెడ్డి, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్, ఎన్నారై సెల్ సభ్యుడు నరేష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్మూర్ గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బొల్లి నరసయ్య, నాగులపల్లి రాజేందర్, లింగంపల్లి తిరుపతి, నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.