09-09-2025 01:23:34 AM
దర్శకుడు పూర్వాజ్ రూపొందిస్తున్న కొత్త సినిమా ‘ఏ మాస్టర్ పీస్’. అరవింద్ కృష్ణ, జ్యోతి పూర్వాజ్, మనీష్ గిలాడ, అషురెడ్డి లీడ్‌రోల్స్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ కండ్రేగుల, మనీష్ గిలాడ, ప్రజయ్ కామత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం క్లుమైక్స్ సీన్స్ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. “జీవితంలో గొప్పగా సాధించబోయే ముందు ఇలాంటి కష్టాలు వస్తుంటాయంటారు.
అందుకేనేమో నాకు కొన్నిసార్లు గాయాలయ్యాయి. మా టీమ్‌లోని చాలా మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘ఏ మాస్టర్ పీస్’ తెలుగు సినిమా ఖ్యాతిని పెంచేలా రూపొందుతోంది” అన్నారు. హీరోయిన్ జ్యోతి మాట్లాడుతూ.. ‘నేను రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ఆ తర్వాత ఈ సినిమా వల్ల పూర్వాజ్ నా జీవిత భాగస్వామిగా మారాడు. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ డిఫరెంట్ వేరియేషన్స్‌లో ఉంటుంది.
నా కెరీర్‌లో నటిగా సంతృప్తినిచ్చిన పాత్ర ఇది. మైథాలజీని, సూపర్ హీరో జానర్‌ను కలిపి ఒక గొప్ప చిత్రాన్ని డైరెక్టర్ రూపొందిస్తున్నారు. నేను పేర్లు చెప్పను కానీ, తెలుగులో వచ్చిన కొన్ని గొప్ప చిత్రాల సరసన ‘ఏ మాస్టర్ పీస్’ చేరుతుంది” అని తెలిపారు. దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ.. “ఏ మాస్టర్ పీస్’ చిత్ర కథను మన పురాణా ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది తయారుచేశాను.
శ్రీరాముడు వనవాసం వెళ్తున్న సమయంలో దశరథ మహారాజు మంత్రుల్లో ఒకరైన సుమంత్రుడికి ఒక వరం లభిస్తుంది. ఆ వరం నేపథ్యంగా సూపర్ హీరో పాత్రను, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి చెందిన ఒక అంశంతో సూపర్ విలన్ క్యారెక్టర్‌ను సృష్టించాం. శ్రీరాముడి త్రేతాయుగానికి, హిరణ్యకశ్యపుడి ద్వాపర యుగానికి, ప్రస్తుత కలియుగానికి అనుసంధానిస్తూ సాగే ఒక కొత్త తరహా స్క్రిప్ట్. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నాం” అన్నారు.
ఈ సినిమాలో సూపర్ విలన్‌గా నటిస్తున్న నిర్మాత మనీష్ గిలాడ మాట్లాడుతూ.. “షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా హై క్వాలిటీతో చేస్తున్నారు” అని చెప్పారు. నిర్మాత శ్రీకాంత్ కండ్రేగుల మాట్లాడుతూ.. “మలయాళంలో మిన్నల్ మురళీ సినిమా స్ఫూర్తితో ‘ఏ మాస్టర్ పీస్’ మొదలుపెట్టాం. హాలీవుడ్‌లో కూడా ఉపయోగించని టెక్నాలజీని వాడుతున్నాం” అని తెలిపారు.