calender_icon.png 29 May, 2025 | 1:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులపై ప్రతిపక్షాలది కపటప్రేమ

28-05-2025 12:00:00 AM

ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ యాట గీత 

ఆమనగల్లు,మే 27 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసి న ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని రైతులెవరూ ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఆమనగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ యాట గీత హామీని ఇచ్చారు. మంగళవారం అమన గల్లు వ్యవసాయ మార్కెట్ కేంద్రావరణలో ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని పాలకవర్గ డైరెక్టర్లతో కలిసి ఆమె సందర్శించారు.

మా ర్కెట్ ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఆమె  ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రకృ తి వైపరీత్యాల కారణంగా ఆకాల వర్షాలు కురిసి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిపక్ష పార్టీలు సాకుగా తీసుకొని రైతులను పరామర్శ పేరిట కేంద్రాలను సందర్శిస్తూ వా రిని తప్పుదోవ పట్టిస్తూ వారిపై కపట ప్రేమ ఓల్క బోస్తున్నారని ఆమె తీవ్రంగా విమర్శించారు.

దేశంలో ఎన్ డి ఏ ప్రభు త్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతులను అరిగోస పెట్టిందని... పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు పంటలకు గిట్టుబాటు ధర అందక రుణమాఫీ కాక ఆత్మహత్యలు చేసుకున్న సంగతి ఆయా పార్టీలు మరవోద్దని ఆమె చురుకలు అంటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఇచ్చిన హామీ మేరకు పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు పంటలకు బోనస్ చెల్లిస్తుందని, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చే సిందని చెప్పారు. 

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బిజెపి బిఆర్‌ఎ స్ చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని... దీనిని చూసి ప్రజలు నవ్వుతున్నారని ఆమె పేర్కొన్నారు.ఆమనగల్ వ్యవసాయ మార్కె ట్లో రికార్డ్ స్థాయిలో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు చేపట్టామని ప్రతిరోజు కొనుగోలు కేంద్రాల్లో 4000 బస్తాలకు పైగా కొనుగోలు చేస్తున్నామని ఇప్పటివరకు 1,36,351 బస్తాలు కొనుగోలు చేసినట్లు ఆమె గుర్తు చేశారు.

కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు మార్కెట్ తరపున రైతులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తూ రైతుల ఆకలి తీర్చడంతోపాటు.. వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సం క్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్ష పార్టీలకు కంటగింపుగా మారిందని అందుకే తమ ఉనికి కోసం ఆయా పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ రోడ్లపై ధర్నాలు ఆందోళన చేస్తు న్నారని ఆమె మండిపడ్డారు.

ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు త మ బుద్ధిని మార్చుకోకపోతే  ప్రజాక్షేత్రంలో ఆయా పార్టీలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఆమె హెచ్చరించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు వస్పుల శ్రీశైలం,  అంజయ్య గుప్తా, రవీందర్, పాం డురంగయ్య,వెంకటరెడ్డి, జంగయ్య గౌడ్,అజీమ్, రమేష్ గౌడ్,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మానయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పసుపుల శ్రీకాంత్ మాజీ సర్పంచ్ పర్వతాలు,మీడియా కన్వినర్ విజేందర్ పాల్గొన్నారు.