30-04-2025 12:00:00 AM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కిష్కింధపురి’. షైన్‌స్క్రీ న్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. అనుపమ పరమేశ్వరన్ హీ రోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఒక యూ నిక్ ప్రపంచంలో సా గే హర్రర్- మిస్టరీ కథ తో రూపొందింది. మంగళవారం ఈ మూవీ మేకర్స్ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
నాయకానాయికలు ఒక హాంటె డ్ హౌస్‌లోకి వెళ్లడంతో కథ మొదలవుతోంది. ‘కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు’ అంటూ సాగే ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ‘అహం మృత్యువు’ అనే డైలాగ్‌ను చెప్పే టెర్రిఫిక్ మూమెంట్‌తో ఈ గ్లింప్స్ ముగిసింది. ఈ చిత్రానికి డీవోపీ: చిన్మయ్ సలాస్కర్; సంగీతం: సామ్ సీఎస్; ఆర్ట్: డీ శివ కామేశ్; ఎడిటర్: నిరంజన్ దేవరమానే.