calender_icon.png 16 August, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలస్తీనా,ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపాలి

13-08-2025 12:00:00 AM

మణుగూరు, ఆగస్టు 12,( విజయ క్రాంతి ) : పాలస్తీనా పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఆపేందుకు ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని, ప్రపంచ శాంతిని కాపాడాలని అఖిలపక్ష పా ర్టీలు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యం లో స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల సమావే శం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యుద్ధాల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు గాలి లో కలిసి పోతున్నాయని,అమెరికా అండతోనే ఇజ్రాయిల్ కొన్నే ళ్లుగా పాలస్తీనా దేశంపై దాడుల కు పాల్పడి ఆక్రమించుకో వాలని ప్రయత్నాలు చేస్తోందన్నా రు. పాలస్తీనా ప్రజలు స్వేచ్ఛా, స్వతంత్య్రం కోసం పోరా డుతున్నారని, అనేక సంవత్సరాలు అయాయకులైన పాలస్తీనాపై దాడులకు పాల్పడి ఇజ్రాయిల్ వేలాది మందిని చంపిందన్నారు.

ఈ విషయంలో ఐక్యరాజ్యసమతి జోక్యం చేసుకుని ఇరు దేశాలమధ్య జరుగుతున్న ప్రచ్ఛన యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. దాడుల్లో వందలాది మంది చనిపోతున్నా ఎవరూ జోక్యం చేసుకోవడం లే దని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతిని కాపాడా లని, భారత్ పై అమెరికా బెదిరింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఈనెల 21న జరిగే శాంతి ర్యాలీలో విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు, శాంతి కాముకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

ఈ సమావేశంలో అఖిల పక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయ కు లు ఆర్. మధుసూదన్ రెడ్డి, కూచిపూడి. బాబు, కుంట. లక్ష్మణ్, జక్కుల. రాజబాబు, సత్తరపల్లి. సాంబశివరావు, వై. పూర్ణచందర్ రావు, ఏ. చంద్రం, పి. కళ్యాణ్ బాబు, ఎండి. సిరాజ్ పా షా,ఎండి. రఫీ, జీవి. రంజిత్, ఆ వుల నరసింహారావు, చెన్నకే శ వులు, ఎం.నాగేశ్వరరావు, బొల్లం. రాజు, ఎస్కే. సర్వర్, అప్ప య్య, జానయ్య, సాగర్ యాదవ్, ఎండి. లియాకత్, బియాభాని, బీవీకేఆర్,  పాల్గొన్నారు.