13-08-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 12 (విజయక్రాంతి):మహిళల ఆర్థిక, సామాజిక స్థిరత్వం సాధనలో భాగంగా జిల్లాలో ఇందిర మహిళా శక్తి కార్యక్రమం క్రింద అర్హులైన మహిళలు, వృద్ధ మ హిళలు, దివ్యాంగులు, కిషోర బాలికలను స్వయం సహాయక సంఘాలలో చేర్చేందుకు మంగళవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో డి ఆర్ డి ఓ విద్యా చందన, అధనపు డి ఆర్ డి ఓ నీలేష్ , మహిళా శిశు సంక్షేమ అధికారి శ్ స్వ ర్ణలత లెనినా , ఎల్ డి ఎం రామిరెడ్డి ,జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుజాత , డీపీఎం లు, ఏపీ ఎం లు, సీసీ లు, ఏం ఎస్ ఓబీ లుపాల్గొన్నారు.