calender_icon.png 25 January, 2026 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణతంత్ర వేడుకలకు ముస్తాబైన పెరేడ్ గ్రౌండ్

25-01-2026 12:59:54 AM

  1. ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరి చందనా దాసరి

పెరేడ్‌లో త్రివిధ దళాల రిహార్సల్స్

సికింద్రాబాద్ జనవరి 24 (విజయక్రాంతి) : గణతంత్ర దినోత్సవ వేడుకలకు సికింద్రాబాద్  పెరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.  పెరేడ్ గ్రౌండ్ కు వచ్చే వారి కోసం సీటింగ్  అరెంజ్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పెరేడ్ గ్రౌండ్లో జరుగుతన్న ఏర్పాట్ల ను జిల్లా కలెక్టర్ హరి చందనా దాసరి శనివారం పరిశీలించారు.

ముఖ్యంగా వీవీఐపీ,వీఐపీ సీటింగ్, ఇరత రాజకీయ ప్రముఖుల గ్యాలరీలు ఎలా ఉండాలి, వీవీఐసీలు, వీఐపీలకు ఎంట్రీ, ఎగ్జిట్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాలను సమీక్షించారు.ఉత్సవాలకు వచ్చే వీఐసీల వాహనాల పార్కింగ్, కామన్ పీపుల్ వాహనాల పార్కిం గ్ ఏర్పాట్లను సైతం ఆమె పరిశీలించారు. కాగా రిపబ్లిక్ డే సందర్బం గా పెరేడ్ గ్రౌండ్లో లో నిర్వహించే సైనిక పెరేడ్ కోసం త్రివిధ దళాలకు చెందిన సైనికులు, రాష్ట్ర పోలీసులు రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు.