calender_icon.png 25 January, 2026 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులకై కలాలను పదునుపెట్టాలి

25-01-2026 12:59:31 AM

బీసీ కవులు, రచయితల ప్రతిజ్ఞ

‘జననాయక’, ‘కర్పూరీ ఠాకూర’ పుస్తకాల ఆవిష్కరణ 

హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): ఎన్నెన్నో మహోద్యమాలకు పాదు వేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం ప్రదేశం వద్ద ఆయన విగ్రహం సాక్షిగా బీసీ కవులు, రచయితలు, విద్యావేత్తలు బీసీల హక్కుల సాధన ఉద్యమానికి తమ కలాలను పదునెక్కిస్తామని ప్రతిజ్ఞ చేశారు. హైదరాబాద్‌లో త్వరలో బీసీ కవులు, రచయితల మహా సమ్మేళనాన్ని నిర్వహించి బీసీ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని బీసీ సాహితీవేత్తలు నిర్ణయించా రు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలుకు సాహిత్య, సాంస్కృతిక రంగం క్రియాశీలక పాత్ర పోషించాలని తీర్మానించారు.

కర్పూరీ ఠాకూర్ 102వ జయంతి సందర్భంగా ట్యాంకబండ్‌పై గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద శనివారం జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన జననాయ క, కర్పూరీ ఠాకూర కవితా సంకలనం, జన నాయక్ కర్పూరీ ఠాకూరపై వ్యాససంకలనం రెండు పుస్తకాలను రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్, లాల్‌నీల్ రూపకర్త, సామాజిక ఉద్య మకారుడు జి.రాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. బీసీల హక్కుల రిజర్వేషన్లు తొలిసారిగా అమలు చేయడం వల్లనే కర్పూ రీ ఠాకూర్ పదవి కోల్పోవలసి వచ్చిందన్నారు. బీహార్ ప్రజల మనస్సుల్లో అట్టడుగు వర్గాల ప్రజల మదిలో కర్పూరీ మచ్చలేని నాయకుడిగా నిలిచిపోయారన్నారు. విధాన ప్రాతిపదికన పనిచేస్తే బీసీలందర్నీ ఏకంచేయవచ్చునన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రగతిశీల శక్తులు పిడికిళ్లు బిగిస్తే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని సృష్టించవచ్చునన్నారు.

బహుజనులంతా ఐక్యమైనప్పు్పడే ప్రత్యామ్నాయానికి మంచి రూపువస్తుందని జస్టిస్ చంద్రకుమార్ విశ్లేషించారు. జూలూ రు గౌరీశంకర్ మాట్లాడుతూ.. బీసీ కవులు, రచయితలు, కళాకారులు ముక్తకంఠంతో గర్జిస్తూ తమ హక్కుల కోసం సాగవలసిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ మహాసభకు సం బంధించిన కార్యాక్రమాలను, ఎన్నెన్నో అస్తిత్వ ఉద్యమాల చర్చలు జరిపిన ప్రదేశం, కేసీఆర్ తన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజినామచేసి తెలంగాణ అస్తిత్వ జెండా ఎత్తిన ప్రదేశం జలదశ్యం ప్రాంగణంలోనే బీసీ సాహితీవేత్తలు ప్రతిజ్ఞ చేయడం బీసీ సాహిత్య ఉద్యమానికి మలు పు అవుతుందన్నారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో 33 జిల్లాల బీసీ కవులు, రచయితలతో మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తామని జూలూ రు ప్రకటించారు.  

కవితాసంకలనం.. సంతోషం

ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జన నాయకుడు కర్పూరీ ఠాకూర్ జ్ఞాపకంలో కవితాసంకలనం వెలువరించడం సంతోషకరమన్నా రు. ఉత్తరాది బీసీ నాయకులు, లాలుప్రసాద్ యాదవ్, ములాయిం సింగ్లను ఆధిపత్య కులవ్యవస్థ అవినీతి నా యకులుగా ముద్రవేసి తప్పు్పడు ప్రచారాలు చేసిందని ఆగ్ర హం వ్యక్తం చేశారు. దేశంలోని బీసీలందరూ ఒక్కటే అని తెలుగు సమాజం నినదిస్తుందని చెప్పారు. కర్పూరీ ఠాకూర్ సేవలను, సామాజిక మార్పు కోసం ఆయన చేసిన కృషిపై ఒక రోజంతా ప్రత్యేక సెమినార్ను బీసీ రచయితలు ఏర్పా టు చేయాలన్నారు. లాల్ నీల్ సృష్టికర్త, సామాజిక ఉద్యమకారుడు జి.రాములు మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమకారుల చరిత్రను వెలికితీసేందుకు బీసీ కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలన్నారు.

బుద్ధుడు, ఫూలే, కబీరు, వేమన, పెరియార్, పోతులూరి, నారాయణగురు, కర్పూరీ ఠాకూర్ల జీవితాలను కొత్తతరంకు తెలియజేయాల్సిన బాధ్యత బీసీ కవులు, రచయితలపై ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య మాట్లాడుతూ.. బుద్ధుడి పుట్టిన నేలలో మంగళి కులంలో జన్మించిన ఠాకూర్ దేశంలో తొలిసారిగా బీసీ రిజర్వేషన్లను అమలు చేసారని తెలిపారు. ఆడంబరాలులేని సాధారణ జీవితం, అసమానతలులేని సమాజ స్థాపన కోసం కర్పూరీ జీవితాంతం కృషి చేసిన యోధుడని తెలిపారు. రచయిత జ్వలిత మాట్లాడుతూ మేమెంతో మాకంత నినాదంతో విరివిగా సాహిత్య సృష్టి  జరగాలన్నా రు. బోధించడం, సమీకరించటం ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలన్నా రు. చట్టసభల్లో బీసీ మహిళలను రిజర్వేషన్లు ఇవ్వాలని తెలియజేశారు. 

చట్టసభల్లోకి రావాలి

అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ కర్పూరీ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన మంగళి కులం నుంచి రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఇప్పటివరకూ ఎమ్మెల్సీకానీ, ఎమ్మెల్యే కాని చట్టసభల్లోకి రాకపోవడం విచారకరమ న్నారు. ఠాక్పూ కవితాస్వరాలు తేవటం బీసీ భా వజాల వ్యాప్తిలో కీలక మలుపు అని బీసీ ఆలోచనావేదిక వ్యవస్థాపకులు కటకం న ర్సింహరావు అన్నారు. కార్యక్రమంలో హైకో ర్టు న్యాయవాది జెల్లి సిద్ధయ్య, సాహిత్య వి మర్శకుడు హెచ్.రమేష్బాబు, తెలంగాణ ప బ్లికేషన్స్ అధినేత కోయ చంద్రమోహన్, రచయిత ఎదిరేపల్లి కాషన్న, అడ్వకేట్ అన్నభీ మోజు నాగార్జునాచారి, కవులు, రచయితలు బాణాల శ్రీనివాస్, షహబాజ్, రామ్దాస్, గంధం బంగారు, జంపాల ప్రవీణ్, గింజల ర్యామ్, విశ్వకర్మల ఆత్మగౌరవ భవనం ట్రస్ట్ వైస్ ఛైర్మన్ మధన్మోహన్ పాల్గొన్నారు.