25-09-2025 12:11:52 AM
కంది శ్రీనివాస రెడ్డి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాం తి): ఆదిలాబాద్ పట్టణంలో బీఆర్‌ఎస్ కు పెద్ద షాక్ తగిలింది. పట్టణంలోని మూడు వార్డులకు చెందిన బీఆర్‌ఎస్ అధ్యక్షులు కాం గ్రెస్ గూటికి చేరారు. బుధవారం కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో 18,19 వార్డుల బీఆర్ ఎస్ అధ్యక్షులు లంక కార్తీక్, ఎండి మతీన్ లతో పాటు 15వ వార్డు బీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బబిత, దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి షేక్ రఫీక్, కోశాధికారి షేక్ చాంద్ పాషా, సలహాదారు మహ్మద్ షరీఫ్, వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖాదీర్ తో పాటు కార్యవర్గ సభ్యులు, పట్టణంలోని రణదివేనగర్, గాంధీనగర్ కు చెందిన పలువురు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నా రు. పార్టీకి ఒక రక్షణ కవచంలా తాను పని చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎవరు వచ్చినా పార్టీలోకి ఘన స్వాగతం పలుకుతామన్నారు. బీఆర్‌ఎస్ వార్డ్ ప్రెసిడెంట్‌ల చేరికతో ఆయా వార్డుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, 5 వందలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ లాంటి మంచి పథకాలు ప్రజల దరి కి చేరుతూ మిగతా పార్టీలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అంతా కలిసి పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ రావు, మునిగిల విఠల్, భూపెల్లి శ్రీధర్, సుధాకర్ గౌడ్, నాగన్న, కొండ గంగాధర్, రఫీక్, దేవిదాస్, శ్రవణ్ నాయక్, చాంద్ షావ్, చిత్రు, సలీం, మహేందర్, సాహెబ్ రావు, తదితరులు పాల్గొన్నారు.