calender_icon.png 19 September, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

19-09-2025 12:00:00 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 18(విజయ క్రాంతి): మహిళా ఆరోగ్యం పైనే కుటుంబం ఆధారపడి ఉంటుందని, ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబాన్ని నిర్మిస్తుందని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని జగిత్యాల నియోజకవ ర్గం శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమా ర్ అన్నారు. స్థానిక పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన స్వస్థనారి శశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమ ప్రారంభంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంటశాలలో మహిళలు ఉప్పును, పంచదారను, నూనెల వాడకాన్ని10 శాతం తగ్గించి కుటుంబ ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. మహిళలు కుటుంబ బాధ్యతలతో తమ ఆరోగ్యాన్ని నిర్ల క్ష్యం చేస్తున్నారని తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ఆహారపు అలవాట్లు, ఆహారం ప్రాముఖ్యత పై అవగాహన పెంపొందించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక వైద్య శిబిరాలలో నిపుణులైన వైద్యుల సేవలు విని యోగించుకొని వ్యాధులను ప్రారంభ దశలో కనుక్కోవడం, రక్తదాన శిబిరాలు ఏ ర్పాటు చేయడం, మహిళా ఆరోగ్యం ప్రాముఖ్యత గూర్చి ప్రజల్లో  అవగాహన కల్పిం చడం జరుగుతుందని,  ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. 

గర్భిణీ స్త్రీలు, బాలింతల ఆహార ప్రాముఖ్యత పై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి, ఈ ఎన్ టీ ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ శ్వేత,ఉప వైద్యాధికారి డా. ఎన్ శ్రీనివాస్ వైద్యాధికారులు డాక్టర్ సంతోష్, ఆర్ బి ఎస్ కే వైద్య అధికారి డాక్టర్ సురేందర్ సిబ్బంది పాల్గొన్నారు.