02-09-2025 12:16:13 AM
-కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి
-జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు
ఆదిలాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీల బిల్లు అసెంబ్లీ సమావేశాలలో ఆమోదం పొందడంపై ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డిల నేతృత్వంలో వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనం తరం రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ల ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం టపాసులు పేల్చి, మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన క్యాంపు కార్యాలయం వద్ద నాయకులు సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జాతీ య, రాష్ట్ర నేతల ఫ్లెక్సీ లకు పాలాభిషేకం చేశా రు.
ఈ పార్టీ నేతలు మాట్లాడుతూ... మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేసే ఘనత కాంగ్రెస్ పార్టీ కే దక్కుతుందన్నారు. 10 ఏళ్ళు అధికారంలో ఉండి కేసీఆర్ బీసీలను అనగదొక్కారని.. కేసీఆర్ చేసిన బీసీ బిల్లు బీసీ లకు మరణ శాసనం అయ్యిందని ఆరోపించారు. బీసీ కుల ఘనన చేసి పకడ్బందీగా బీసీ బిల్లు తెచ్చి బీసీ లకు రాజకీయ సుస్థిర స్థానం కల్పిస్తున్న ఘనత ప్రజా పాలన దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు.
రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశయాల మేరకు ఎవరి జనాభా ప్రకారం వారి వాటా ఉండాలన్న లక్ష్యం తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ శ్రేణులు ప్రజల్లోకి ఈ విషయాన్నీ విస్తృతంగా తీసుకువెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రతిపక్ష నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చర్యలను సమాజం సంపూర్ణాంగా స్వాగతించాలని ఆయన ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు
నిర్మల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం సంబరాలు నిర్వహించారు. దేశ జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం బిసి డిక్లరేషన్ ఆమె మేరకు నిర్ణయం తీసుకొని బిల్లును ఆమోదించుకోవడం జరిగిందని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ ఇన్చార్జి రామ్మోహన్ అన్నారు.
ఆర్డీవో కార్యాలయం ఎదుట పటాసులు కాల్చి సీట్లు పంచిపెట్టారు. అంతకుముందు మీడియా సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంతో బీసీలకు ప్రయోజనం ఉంటుందని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజుమత్ అలీ, మాజీ మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడ్ చిన్ను మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ యాదవ్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు