02-09-2025 12:16:13 AM
నలుగురు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
అడ్డాకుల సెప్టెంబర్ 1: ఎన్ హెచ్ 44 జాతీయ రహదారి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల మండల కేంద్రంలోని ఎన్హెచ్ 44 రహదారి పల్లవి డాబా ఎదురుగా తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొనగా నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటనలో మరో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే హైదరాబాదు నుండి పొద్దుటూరు వైపు ప్రయాణికులను తీసుకువెళ్తున్న సివిఆర్ ప్రవేట్ ట్రావెల్స్ బస్సు అడ్డాకుల కాటవరం శివారి ముందుకు వెళుతున్న లారీని వేగంగా ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో బస్సు క్లీన్డార్ హుస్సేన్ (35) రాయలసీమ, నంద్యాలకు చెందిన అప్రోస్ ఉనిస (70), పొద్దుటూరు కమలాపురం చెందిన ఎల్లమ్మ (40) మృతి చెందగా, ఆస్పత్రికి చికిత్స పొందుతూ నంద్యాలకు చెందిన సుబ్బ రాముడు(58) మృతి చెందాడు. మరొక ముగ్గురు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 31 ప్రయాణికులు ఉన్నారు. రోడ్డు ప్రమాదం జరగడంతో సమాచారం తెలుసుకున్న జడ్చర్ల రూలర్ సీఐ కమలాకర్, అడ్డాకుల ఎస్త్స్ర శ్రీనివాసులు, భూత్పూర్ ఎస్త్స్ర చంద్రశేఖర్, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన వాహనాలను తొలగించి. గాయపడ్డ వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒంటరి అయిన బాలుడు...
రోడ్డు ప్రమాదంలో తన తల్లి ఎల్లమ్మ మరణించడంతో ఆమె కుమారుడు సంతోష్ ఒంటరి అయ్యాడు. ఎల్లమ్మ భర్త గతంలోని మరణించడంతో తన కుమారుడు సంతోష్ ను పొద్దుటూరులో హాస్టల్లో ఉంచి, తను బతుకుతెరువు హైదరాబాదులో ఉండడం తో ఇటీవలో తన కుమారుడిని హైదరాబాద్ తీసుకువచ్చి తిరిగి సొంత ఊరికి బయలుదేరారు. రోడ్డు ప్రమాదంలో తల్లి కూడా మరణించడంతో నాలుగు తరగతి చదువుతున్న సంతోష్ ఒంటరిగా అయ్యి బిక్కు బిక్కుమంటు కూర్చున్న తీరు. అందరిని కల్చివేసింది.