calender_icon.png 17 September, 2025 | 10:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్యశ్రీ సేవలు ఆపొద్దు

17-09-2025 02:10:54 AM

  1. పైవేట్ దవాఖానలకు ఆరోగ్యశ్రీ సీఈవో విజ్ఞప్తి 
  2. ప్రభుత్వం విజ్ఞప్తిపై స్పందించని ప్రైవేట్ ఆసుపత్రుల నెట్‌వర్క్ సంఘం  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించాలని ప్రైవేట్ హాస్పటళ్ల యాజమాన్యాలకు ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్ విజ్ఞప్తి చేశారు. వైద్య సేవల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన కోరా రు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెం టనే ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచటంతో పాటు గడిచిన 21 నెలల్లో రూ.1,779 కోట్లను హాస్పిటళ్లకు ప్రభుత్వం చెల్లించిందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు.

ప్యాకేజీల చార్జీల పెంపు కోసం ప్రైవేట్ దవాఖా నాల యాజమాన్యాలు దశాబ్దకాలం ఎదురుచూశాయని, ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,375 వైద్య చికిత్సల చార్జీలను సగటున 22 శాతానికి పైగా పెంచిన విషయాన్ని సీఈ వో గుర్తు చేశారు. కొత్తగా 163 రకాల ఖరీదైన వైద్య సేవలను ఆరోగ్యశ్రీలో చేర్చి పేషెంట్లను ఆదుకుం దని.. చార్జీల పెంపు, కొత్త ప్యాకేజీల చేర్పుతో అదనంగా రూ.487.27 కోట్లను ప్రభుత్వం రోగుల కోసం ఖర్చు చేస్తోందన్నారు.

2014 నుంచి 2023, నవంబర్ సగటున నెలకు రూ. 57 కోట్లు చెల్లించగా, 2023, డిసెంబర్ నుంచి 2024, డిసెంబర్ వరకు సగటున నెలకు రూ.75 కో ట్లు చెల్లించామని సీఈవో పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకు రూ.95 కోట్లు చెల్లిస్తున్నామని, హాస్పిటళ్ల యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు నెలకు వంద కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఉద య్ వెల్లడించారు.

హాస్పిటల్స్ యా జమాన్యాల ఇతర విజ్ఞప్తుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూ లంగా ఉందన్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలు బంద్ చేస్తామని తెలంగాణ ప్రవైట్ ఆస్పత్రుల నెట్‌వర్క్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభు త్వం చేసిన విజ్ఞప్తికి ఇంకా ప్రైవేట్ ఆ సుపత్రుల నుంచి స్పందన రాలేదు.