calender_icon.png 10 August, 2025 | 8:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోలింగ్ వాహనమే అంబులెన్స్

23-04-2025 12:00:00 AM

  1. పోలీసు వాహనంలో గాయపడిన మహిళను దవాఖానకు తరలింపు 

మానవత్వం చాటుకున్న సీఐ నాగరాజుగౌడ్

ఎల్బీనగర్, ఏప్రిల్ 23 : కేసుల విషయంలో కరకుగా వ్యవహరించడమే కాకుం డా హయత్ నగర్ పోలీసులు మానవత్వం తో స్పందించి ఓ ప్రాణం నిలిపారు. హయత్నగర్ పోలీస్ స్టేషన్ సీఐనాగరాజు గౌడ్, డ్రైవర్ ఏఆర్పీసీ రామకృష్ణ సోమవారం రాత్రి పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్నారు. ఆ సమయంలో ఓ ప్రమాదంలో గాయపడి రోడ్డు పక్కన ఉన్న మహిళను గమనించారు. వెంటనే స్పందించిన సీఐ నాగరాజు గౌడ్...

దవాఖానకు తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి ఆలస్యం అవుతుందని.. పెట్రోలింగ్ వాహనంలోనే గాయ పడిన మహిళను దవాఖానకు తీసుకెళ్లారు. సమయానికి చికిత్స అందించడంతో  ప్రా ణాపాయం తప్పిందని... ఆలస్యమైతే ప్రాణాలకే ముప్పు ఉండేదని వైద్యులు చెప్పారు. సీఐనాగరాజుగౌడ్ స్పందించిన తీరుపై ప్రజలు అభినందనలు తెలిపారు.