calender_icon.png 18 December, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్ఠు సర్వే పెండింగ్ బిల్లులు చెల్లించాలి

18-12-2025 02:03:32 AM

మహబూబాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి) : ఎల్సీడీసీ, ఎన్‌డీడీ సర్వే లు నిర్వహించి మూడు సంవత్సరాల గడుస్తున్నా ఆశా వర్కర్లకు పెండింగ్ సర్వే బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, పాత బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో కంబాలపల్లి వైద్యాధికారికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకుడు  రాజమౌళి మాట్లాడుతూ పాత బకాయి లు ఇవ్వకుండా, నెలకు ఇచ్చే పారితోషకంతోనే అదనంగా లెప్రసీ సర్వే చేయ మనడం అన్యాయమన్నారు. ఇప్పటికే ఆశ కార్యకర్తలు పని భారంతో ఇబ్బంది పడుతుంటే పనికి తగ్గ ఫలితం కనీస వే తనం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కుమ్మరి కుంట్ల నాగన్న. ఆశా వర్కర్ నాయకులు కరుణ, హసీనా, సునీత, విజయ, సావిత్ర, సుకన్య, రమ్య, రమ, కీర్తన, సరిత పాల్గొన్నారు.